ఆ ఇద్దరు ఎవరో చెప్పకుండా బన్నీ సస్పెన్స్‌..!

Update: 2018-12-18 16:22 GMT
అల్లు అర్జున్‌ ఈమద్య కాలంలో సినిమా ఏదీ కమిట్‌ కాలేదు. కనుక కాస్త ఎక్కువ ఖాళీ సమయం దొరకడంతో సన్నిహితుల, సొంత బ్యానర్‌ సినిమాల ఫంక్షన్స్‌ కు ఎక్కువగా హాజరు అవుతున్నాడు. తాజాగా శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ‘పడి పడి లేచె మనసు’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొన్నాడు. ఆ సినిమాలో అల్లు అర్జున్‌ చేసిన ‘గారు..’ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తెగ చర్చనీయాంశం అవుతున్నాయి. సమాజంలో ఒక స్టేటస్‌ ఉన్న వ్యక్తులను తప్పకుండా గారు అనాని, వారిని విమర్శించాలన్నా కూడా గారు అంటూ సంబోధిస్తూ విమర్శించాలని కొందరు సూచించాడు.

అదే సమయంలో సాయి పల్లవి గురించి మాట్లాడుతూ నాకు సాయి పల్లవి అంటే చాలా అభిమానం, ఆమెతో సినిమా చేస్తే, ఆమెతో డాన్స్‌ చేయడం కోసం ఎదురు చూస్తున్నాను. ఫిదా చిత్రంలోని వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే... పాటను ఎన్ని సార్లు చూశానో అన్నాడు. నాకు మాత్రమే కాకుండా ఒక స్టార్‌ హీరోకు కూడా సాయి పల్లవి అంటే అమితమైన అభిమానం అన్నాడు. అయితే ఆ స్టార్‌ హీరో ఎవరు అనే విషయంపై మాత్రం బన్నీ క్లారిటీ ఇవ్వలేదు.

ఇక శర్వానంద్‌ గురించి మాట్లాడిన సమయంలో శర్వా మంచి కథలు ఎంచుకోవడం, మంచి నటన చేయడం అంతా బాగానే ఉంది కాని, కామెడీ మాత్రం శర్వా చేయలేడు అంటూ ఒక దర్శకుడు నాతో అన్నాడు. ఆ దర్శకుడు రన్‌ రాజా రన్‌ చిత్రం తర్వాత నాకు ఫోన్‌ చేసి బన్నీ బాబు శర్వానంద్‌ కామెడీ కూడా బాగా చేస్తాడని నిరూపించుకున్నాడని అన్నాడు. ఆ దర్శకుడు ఎవరు అనే విషయం కూడా బన్నీ చెప్పలేదు. బన్నీ క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్‌ లో ఉంచిన ఆ ఇద్దరు ఎవరై ఉంటారు అంటూ ఎవరికి తోచిన అంచనాలు వారు అనేసుకుంటున్నారు. బన్నీ ఆ విషయాలపై మళ్లీ ఎప్పుడు నోరు తెరుస్తాడో చూడాలి.

Tags:    

Similar News