‘‘కొందరి’’ గురించి అన్ని మాటలేంది బ్రదర్?

Update: 2016-05-19 06:54 GMT
ఫంక్షన్లలో ‘‘పవర్ స్టార్.. పవర్ స్టార్’’ అని అరవటం.. తాను మాట్లాడకుండా వెళ్లిపోవటం అంశానికి సంబంధించి స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్ చెలరేగిపోతూ.. ‘‘ఒక మనసు’’ సినిమా ఆడియో ఫంక్షన్లో మాట్లాడటం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నాగబాబు కుమార్తె నిహారిక నటిస్తున్న సంగతి తెలిసిందే. సో.. తమ ఫ్యామిలీకి సంబంధించిన వారి ఆడియో ఫంక్షన్ కు వచ్చిన అల్లు అర్జున్.. ‘‘పవర్ స్టార్’’ ఇష్యూ గురించి మీతో మాట్లాడతానంటూ మాట్లాడేశారు.

పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ కొంతమంది అభిమానులు ప్రతిచోట విపరీతంగా అరుస్తున్నారని.. దాని వల్ల చాలామందికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పుకొచ్చారు. ‘‘నేను ప్రత్యేకంగా చెబుతున్నాను.. అందరు అభిమానులు కాదు.. కొందరుఅభిమానులు మాత్రమే. ఎవరు.. ఇలా ఫంక్షన్లకు సరదాగా వచ్చి అరిచేవాళ్లు. మేం పబ్లిక్ ఫంక్షన్లు పెట్టేదే మీరు సరదాగా వచ్చి అరుస్తారని. ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి.. పవర్ స్టార్.. పవర్ స్టార్ అని అరిసేసి.. కొన్ని ఫంక్షన్లలో ఇబ్బంది పెడుతున్నారు. నేను ఆ పర్టిక్యులర్ గ్రూప్స్.. అలా మాట్లాడటం వల్ల.. నేను ఆయన గురించి టాపిక్ అవాయిడ్ చేశాను. ఇంకా చాలా ఉంది బ్రదర్. నన్ను నమ్మండి. తప్పదు. నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. లేదు.. లేదు.. అరవొద్దు.. మీరు అరిసే పంచ్ డైలాగులు కూడా చెబుతా తర్వాత’’

‘‘నేను మీతో కొన్ని విషయాలు ఓపెన్ గా షేర్ చేసుకుంటాను. చాలామంది ఆర్టిస్ట్ లకు ఇలాంటి ఫంక్షన్లకు వచ్చినప్పుడు వాళ్ల పర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకోవాలని ఉంటుంది. ఎప్పుడో కానీ ఇలాంటి చాన్స్ దొరకదు. అలాంటి ఫీలింగ్స్ వారికి దొరకదు. ఆ.. (ఎవరో ఏదో కామెంట్ చేశారు) మాట్లాడతా బ్రదర్.. ఇవాళ అందరికి రౌండప్ ఇచ్చే వెళతా బ్రదర్ నమ్ము. వాళ్లకు వాళ్ల పర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకోవాలని ఉంటుంది. కానీ.. మీరిలా.. పవర్ స్టార్.. పవర్ స్టార్ అని అరిచేస్తుంటే.. ఆయన అంత పెద్ద హీరో కాబట్టి.. కంగారుపడి ఏదో మెకానికల్ గా రెండు నిమిషాలు చెప్పేసి.. అంత పెద్ద హీరో కదా.. అంత మంది అరుస్తున్నారు కదా అని.. ఆర్టిస్ట్ లు కూడా మెకానికల్ గా మాట్లాడేసి వెళ్లిపోతున్నారు’’

‘‘మీరు అరవకుండా వాళ్లు చెప్పేది సరదాగా వింటే.. వాళ్ల పర్సనల్ ఫీలింగ్సూ వాళ్లు చెప్పుకుంటారు. సేమ్ టైం పవన్ కల్యాణ్ గురించి అందంగా చెప్పుకుంటూ వెళతారు. ఆర్టిస్ట్ లు మాట్లాడేటప్పుడు అరవండి.. కానీ అవతల ఆర్టిస్ట్ డిస్ట్రబ్ అయ్యే అంతగా మాత్రం అరవొద్దు. అందరూ.. అన్ని విషయాలు చెబతా. ఒక పెద్ద డైరెక్టర్ ఒక సినిమా తీసి.. ఆ సినిమా గురించి మాట్లాడుతుంటే.. మీరు పవర్ స్టార్.. పవర్ స్టార్ అని అరుస్తున్నారు. ఆయన ఆ ఫంక్షన్ పెట్టింది.. ఆయన ఆ సినిమా గురించి మాట్లాడాలి. మీరు అరవకపోయినా ఆయన అద్భుతంగా చెబుతారు పవర్ స్టార్ గురించి. ఆయన మాటలు అంత బాగుంటాయి. ఆయన ఒక సినిమా కష్టపడి తీసి.. వందరోజులు కష్టపడి తీసి.. కోట్లు పెట్టి.. సినిమా గురించి చెప్పనీయకుండా అరుస్తుంటే.. నిజంగా తప్పు బ్రదర్. ఒక డైరెక్టర్ కు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫ్యాన్స్ గా మీ రెస్పాన్స్ బులిటీ. ఇంకా ఉంది బ్రదర్.. చాలా ఉంది బ్రదర్. మన ఫంక్షన్లలలో మన హీరోల గురించి మాట్లాడితే లోపల యస్ అని ఉంటుంది.కానీ.. మన ఫంక్షన్లు కానీ.. బయట పంక్షన్లలోకి మీరు వెళ్లి పవర్ స్టార్.. పవర్ స్టార్ అని అరుస్తున్నారు. అది చాలా తప్పు బ్రదర్’’

ఈ మాటలన్నీ చెప్పింది.. పొల్లు తప్పు లేకుండా అల్లు అర్జున్ చెప్పిన మాటలే. ఎందుకంటే..ఆయన మాటల్ని వీడియో వింటూ రాసినవి కాబట్టి అన్ని ఆయన మాటలే ఉంటాయి. ఇన్ని మాటల తర్వాత కలిగే సందేహం ఒక్కటే. ‘‘కొందరు’’ పవర్ స్టార్ అభిమానుల గురించి అందరి ముందు ఇంతలా మాట్లాడటం ఏమిటి? అంతలా రియాక్ట్ కావటం ఎందుకు? అది కూడా.. తన సినిమాకు సంబందం లేని సినిమా ఫంక్షన్ కు వచ్చి.. అక్కడి వాతావరణం మొత్తాన్ని గంభీరంగా మార్చేయటం ఏమిటి? తాను లాజిక్ గా చెప్పే విషయాల్ని వినాలని చెప్పిన అల్లు అర్జున్.. తాను చెప్పిన మాటల్లోని లాజిక్ మిస్ కావటం ఏంటి? దీనికి బాధ్యతగా (రెస్పాన్సిబులిటీతో) సమాధానం ఇచ్చే వారెవరు..?
Tags:    

Similar News