మూడు రోజులుగా టాలీవుడ్లో ఎక్కడ చూసినా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ గురించే చర్చ. పెద్ద నోట్ల రద్దుతో కలెక్షన్లు బాగా దెబ్బ తిన్న టైంలో విడుదలై.. అనూహ్యమైన కలెక్షన్లతో దూసుకుపోతోందీ చిన్న సినిమా. ఈ సినిమాలో ఆకర్షణలు చాలానే ఉన్నాయి. అందులో కథానాయిక నందిత పెర్ఫామెన్స్ కూడా ఒకటి. దయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో అదరగొట్టిసింది ఈ బెంగళూరు బ్యూటీ. సామాన్య ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఆమె మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తన తమ్ముడు శిరీష్ తో వీఐ ఆనంద్ సినిమా చేయబోతున్న నేపథ్యంలో బన్నీ కూడా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చూశాడట. సినిమాతో పాటు నందిత పెర్ఫామెన్స్ కూడా బాగా నచ్చడంతో వెంటనే ఆమెకు ఫోన్ కూడా చేసి అభినందించాడట.
బన్నీ తనకు ఫోన్ చేసిన విషయాన్ని నందితే స్వయంగా వెల్లడించింది. ‘‘నా పెర్ఫామెన్స్ నచ్చి బన్నీ నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ‘వెల్కమ్ టు టాలీవుడ్’ అన్నారు. ఆయనతో పని చేయాలని ఉందని చెప్పాను’’ అని నందిత వెల్లడించింది. తమిళంలో నాలుగేళ్లుగా సినిమాలు చేస్తున్నానని.. తెలుగులోకి రావడానికి కొంచెం లేటైన మాట వాస్తవమే అని.. ఐతే ఇంతకుముందు అనుకున్న కొన్ని ప్రాజెక్టులు ఓకే కాలేదని నందిత తెలిపింది. ‘‘తెలుగు సినిమాల్లోకి రావడానికి నాలుగేళ్లు పట్టిందా.. అని చాలా మంది అడిగారు. కానీ కొన్ని సినిమాలను నేను వద్దనుకున్నాను. కొందరు నన్ను వద్దన్నారు. ఎట్టకేలకు ఈ కథను ఓకే చేసి చేశాను. హిట్ అయింది. లక్కీ గర్ల్ అనే పేరు వచ్చింది. తొలి సినిమాకే లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. అందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని నందిత తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/