స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఎవరికి లేని ఓ ప్రత్యేకత ఉంది. మన వాళ్ళకు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ ఉండటం సహజమే కాని కేరళలో అక్కడి స్టార్లతో సమానంగా అభిమాన సంఘాలు ఉండటం ఒక్క బన్నీకే సాధ్యమయ్యింది.అంతటి చిరంజీవి కూడా ఈ ఘనతను అందుకోలేదు. అయితే నా పేరు సూర్య తర్వాత సుమారు 8 నెలలుగా ఖాళీగా ఉన్న బన్నీ సబ్జెక్టు విషయంలో రాజీ పడకపోవడం వల్లే కొత్త సినిమా ఇప్పటిదాకా ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను లాక్ చేసుకున్న బన్నీ జనవరిలోనే మొదలు పెడతాడు అనే టాక్ వచ్చింది
కాని స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో రెడీ కాకపోవడంతో రెగ్యులర్ షూటింగ్ ని ఈ నెలకు వాయిదా వేసారు. 14న పూజా కార్యక్రమాలు ఉండొచ్చు. ఇదిలా ఉండగా పబ్లిక్ ఫంక్షన్స్ లో స్పీచుల ద్వారా సోషల్ మీడియాలో ఈ మధ్య బన్నీ మంచి ట్రాలింగ్ టాపిక్ అవుతున్నాడు. పడి పడి లేచే మనసు వేడుకలో గారు గురించి క్లాస్ పీకడం మొన్న ప్రియా వారియర్ సినిమా ఫంక్షన్ లో కట్టప్పను బాహుబలి చంపాడని పొరపాటు పడటం ఇవన్ని నెటిజెన్లకు మంచి ఫీడ్ ని ఇచ్చాయి.
అయితే కొత్త సినిమా ప్రారంభం గురించి ఎదురు చూసే కొద్ది ఆలస్యం అవుతుండటం వెనుక ఉద్దేశం ఏదైనా ఫ్యాన్స్ మాత్రం కొంత అసహనంగానే ఉన్నారు. అయితే ఇంత కాలం వెయిట్ చేసి ఇప్పుడు తొందరపడితే అంతా వృధా అయిపోతుందన్న ఆలోచనతో త్రివిక్రమ్ ఎప్పుడు అంటే అప్పుడే షూటింగ్ చేసేలా బన్నీ ముందే తన మాట చెప్పేశాడట. వచ్చే గ్యాప్ ఎలాగూ వచ్చింది. ఇకనైనా దీన్ని జాగ్రత్తగా వాడుకుని ట్రాక్ లో పడాలనే ప్లాన్ కావొచ్చు. ఏదైతేనేం అల్లు అర్జున్ ఈ ఏడాది సినిమాతో రావడం ఖాయమే కాని అది ఎప్పుడు అనేది మాత్రం సస్పెన్స్.