అల్లు అర్జున్, తారక్ మల్టీ స్టారరా?
ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ ముగ్గురు హీరోల బ్రాండ్ ఇమేజ్ ప్రస్తుతం బాలీవుడ్ హీరోల కంటే ఎక్కువగా ఉంది. దేశ వ్యాప్తంగా వీరి సినిమాలకి మార్కెట్ దొరికింది. ఈ నేపధ్యంలో మన టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా లెవల్ లోనే తమ సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ దర్శకులు, నిర్మాతల దృష్టి కూడా టాలీవుడ్ హీరోల పైనే పడింది అనే మాట వినిపిస్తోంది. అడ్వాన్స్ లెవల్, పీరియాడిక్ కథలని తెరకెక్కించాలి అంటే సౌత్ హీరోల తోనే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఓం రౌత్ ఆదిపురుష్ మూవీని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేస్తున్నారు.
అలాగే వార్ 2 కోసం యష్ రాజ్ ఫిలిమ్స్ జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దించింది. ఇప్పుడు మరో బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ స్టార్స్ అయిన అల్లు అర్జున్, తారక్ కాంబినేషన్ ని సెట్ చేసే పనిలో ఉన్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ప్రస్తుతం ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ అనే మూవీని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు.
ఈ మూవీ కోసం ముందుగా విక్కీ కౌశల్ ని తీసుకోవాలని అనుకున్నారు. అతని ప్లేస్ లోకి తరువాత రణవీర్ సింగ్ వచ్చాడు. అయితే ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ నుంచి రణవీర్ సింగ్ కూడా తప్పుకున్నాడంట. స్టొరీ తనకి సెట్ కాదని భావించి రణవీర్ సింగ్ తప్పుకున్నాడు అనే టాక్ వినిపిస్తోంది.
ఈ నేపధ్యంలో మూవీకి పాన్ ఇండియా ఇమేజ్ రావాలన్నా, పెట్టిన పెట్టుబడి వెనక్కి రాబట్టాలన్నా టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ తో అయితే బెటర్ అని నిర్ణయానికి దర్శకుడు వచ్చాడంట. ఈ నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ది ఇమ్మోర్టల్ అశ్వత్థామని తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం వారి డేట్స్ కోసం దర్శకుడు ఆదిత్య ధర్ ప్రయత్నం చేస్తున్నారంట.