మొదటిసారి ధియేటర్లో అల్లు జూనియర్..

Update: 2018-04-28 04:49 GMT
పిల్లలను పెంచడంలో ఎన్నో మధురానుభూతులు ఉంటాయి. వాళ్ల ఆటపాటలు.. ముద్దు ముద్దు మాటలు... అల్లరి చేష్టలు.. కొంటె పనులు ఎన్నో గుర్తుండిపోతాయి. అలాగే కొడుకు చేయి పట్టుకుని మొదటిసారి థియేటర్ కు తీసుకెళ్లి సినిమా చూపించడమూ ఓ అందమైన అనుభవమే. ఈ హ్యాపీ మూమెంట్ ను అల్లు అర్జున్ ఎంజాయ్ చేశాడు.

అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ ను తీసుకుని మొదటిసారి సినిమాకు తీసుకెళ్లాడు. అది తను నటించిన సినిమా కాదు. అది ప్రపంచవ్యాప్తంగా రిలీజైన లేటెస్ట్ హాలీవుడ్ యాక్షన్ మూవీ అవెంజర్స్ : ఇన్ఫినాటీ వార్ మూవీ. భార్య స్నేహా.. కూతురు - కొడుకుతో కలిసి ఈ మూవీ చూసొచ్చాడు. ఈ హ్యాపీ మూమెంట్ ను బన్నీ భార్య స్నేహా సోషల్ మీడియాలో షేర్ చేసింది. సకుటుంబ సమేతంగా బన్నీ ఇచ్చిన స్టిల్ అబిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా జూనియర్ అల్లు ఎక్సయిట్మెంట్ చూస్తుంటే ముచ్చటేస్తోంది.

అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా షూటింగ్ పూర్తి చేసుకుని సినిమా రిలీజుకు సిద్ధమైంది. కాస్త ఖాళీ దొరికింది కాబట్టి ఇదిగో ఇలా ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపాడు. ఏప్రిల్ 27న విడుదలైన అవెంజర్స్ మూడో పార్ట్ ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ ప్రియులందరినీ అలరిస్తూ కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తోంది.
Tags:    

Similar News