అల్లు శిరీష్ సినిమాకు నాలుగేళ్లు పూర్తయ్యాయి. శిరీష్ నటించిన చిత్రం `ఒక్క క్షణం`. విఐ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొంది మంచి విజయాన్ని సాధించింది. సురభి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సీరత్ కపూర్, శ్రీనివాస్ అవసరాల, దాసరి అరుణ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. లక్ష్మీ నరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చక్రి చిగురుపాటి నిర్మించారు. 2017 డిసెంబర్ 28న ఈ చిత్రం విడుదలైంది.
ముందు మిక్స్‌డ్ టాక్ వినిపించినా ఆ తరువాత సినిమా ఓ ప్రయోగంగా కనిపించడంతో విమర్శకులు సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తను చేసిన కొత్త తరహా సినిమా కావడంతో ఈ సినిమాకు శిరీష్ ప్రత్యేక స్థానాన్నిచ్చాడు. హిందీలో 2019లో `శూర్ వీర్ 2`గా, మలయాళంలో 2020లో `ప్యారలల్ క్రైమ్`గా విడుదలై మంచి విజయాల్ని సాధించడమే కాకుండా హీరో శిరీష్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ రోజుతో ఈ సినిమా విడుదలై సరిగ్గా నాలుగేళ్లవుతోంది.
ఈ సందర్భంగా హీరో శిరీష్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్ నేపథ్యంలో తెలుగులో వచ్చిన తొలి చిత్రమిది. దీంతో ఈ సినిమాపై అప్పట్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ స్థాయికి తగ్గరీతిలోనే సినిమా మంచి విజయాన్ని సాధించింది. తెలుగుతో పాటు నాలుగు భాషల్లో విడుదలై మంచి విజయంతో పాటు ప్రశంసలు పొంది పాన్ ఇండియా లెవెల్లో శిరీష్‌కు మంచి గుర్తింపుని అందించింది.
ఇక ఈ రోజుతో ఈ సినిమా 4 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఈ సినిమా జ్ఞాపకాల్ని మరోసారి గుర్తు చేసుకున్నారు హీరో శిరీష్. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ``ఒక్క క్షణం` నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. అంతే కాకుండా నేను నటించి అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచిపోయింది. తెలుగు వెర్షన్ హిందీలో `షూర్ వీర్ 2` గా అనువాదమైంది. టెలివిజన్ తో పాటు యూట్యూబ్‌లోనూ భారీ విజయాన్ని సాధించింది.
గత లాక్ డౌన్ లో తమిళంలోకి `అంద ఒరు నిమిదం`గా డబ్ అయి స్టార్ విజయ్ లో ఆకట్టుకుంది. అంతే కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా మలయాళంలోకి కూడా డబ్ చేయబడింది. అక్కడి విమర్శకుల ప్రశంసల్ని సైతం దక్కించుకుంది. మా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నాలుగు భారతీయ భాషల్లో ప్రదర్శింపబడి విజయం సాధించడం దర్శకుడు విఐ ఆనంద్ కి, నాకు గర్వంగా వుంది. నిజంగా పాన్ ఇండియన్ మూవీ ఇది.
నాలుగు సంవత్పరాల ఒక వేడుకని జరుపుకోవడానికి ఇంత కంటే మంచి సందర్భం మంచి క్షణం మరొకటి లేదు. ఉండదు. అందరి ప్రేమకు ధన్యవాదాలు` అని శిరీష్ పేర్కొన్నారు. అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రం `ప్రేమ కథంట`. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 తో కలిసి శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.