అప్పుడే కొత్త జంటను కొట్టేశాడు

Update: 2016-08-12 15:30 GMT
అల్లు శిరీష్ ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన శ్రీరస్తు శుభమస్తు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుండడమే ఇందుకు కారణం. ఇలాంటి రోజు కోసం అల్లు వారబ్బాయి నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. 2012 లో గౌరవం సినిమాను మొదలుపెట్టి 2013 రిలీజ్ చేసాడు అల్లు శిరీష్. ఆ తర్వాత 2014లో కొత్త జంట అన్నా సరైన హిట్ మాత్రం పడలేదు.

ఇప్పుడు సరైన హిట్ తో మెగా ఫ్యాన్స్ నే కాదు.. తనను తాను కూడా హ్యాపీ చేసుకోగలిగాడు. ఇంత ఆనందించడానికి కారణం ఉంది లెండి. మొదటి వారం ముగిసేనాటికే శ్రీరస్తు శుభమస్తు చిత్రానికి 5.75 కోట్ల కలెక్షన్స్ సాధించింది. మెగా ఫ్యామిలీ హీరోకి ఇది చిన్నమొత్తమే అనిపించచ్చు కానీ.. కొత్త జంటకు ఫుల్ రన్ లో వచ్చిన కలెక్షన్ కంటే ఇది ఎక్కువ అనే విషయం గుర్తుంచుకోవాలి. అందుకే ఇప్పుడు శిరీష్‌ కూడా కొత్త జంటను కొట్టేశాం అంటూ ఫుల్లు హ్యాపీగా ఉన్నాడు.

ఈ వారం కూడా బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేసే అవకాశం ఉండడం.. వచ్చే వారం కూడా థియేటర్లను ఖాళీ చేయించేంతటి పెద్ద బొమ్మలేం రాకపోతుండడంతో.. అల్లు శిరీష్ సినిమాకి కలెక్షన్స్ రాబట్టే అవకాశం మరికొన్నాళ్లు ఉన్నట్లే. ఇప్పటికే శ్రీరస్తు శుభమస్తుకి శాటిలైట్ రూపంలో 3 కోట్లు గిట్టుబాటు కావడంతో.. ఈ ప్రాజెక్ట్ ని 100 పర్సెంట్ భారీ లాభాలిచ్చిన వెంచర్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
Tags:    

Similar News