ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' మూవీతో బాక్సాఫీసును రఫ్పాడించాడు. 'తగ్గెదేలే' అని చెప్పిన ఈ ఒక్క డైలాగ్ ఇండియానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ లో నిలిచింది. దీనిపై ఎంతో మంది రీల్స్, మీమ్స్ చేయడంతో ఈ డైలాగ్ తెగ వైరల్ అయిపోయింది. ఇక సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు 'తగ్గెదేలే' డైలాగును ఓ రేంజ్ లో వాడారు.
అల్లు అర్జున్ కేవలం సినిమాల్లోనే మాత్రం యాటిట్యూడ్ ని చూపిస్తాడు. నిజజీవితంలో మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు. ఫ్యామిలీ, అభిమానుల విషయంలో చాలా హుందాగా వ్యవహరిస్తుంటాడు. అప్పుడో చికాకు కలిగినపుడు మినహా అల్లు అర్జున్ దాదాపు కూల్ గా.. నవ్వుతూనే కన్పిస్తుంటాడు. అల్లు అర్జున్ బేసిక్ గా చాలా ఎమోషనల్ పర్సన్ అని సన్నిహితులు చెబుతూ ఉంటారు.
మెగాస్టార్ చిరంజీవి ఆ మధ్య 'గ్యాంగ్ లీడర్' సినిమాలోని ఓ పాటకు స్టేజ్ పై డాన్స్ చేస్తే ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్నాడు. దీనిని కొంతమంది నెగిటివ్ గా ప్రచారం చేసినా అల్లు అర్జున్ ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు. ఇకపోతే అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ తన అన్ననే ఫాలో అవుతున్నాడు. సినిమా విషయంలోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ అతడినే ఆదర్శంగా తీసుకున్నాడు.
అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం 'ఊర్వశివో.. రాక్షసివో..'. ఈ సినిమా నవంబ 4న విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చిత్రబృందం షూరు చేసింది. ఏపీలోని పలు కళాశాలలకు తిరుగుతూ తమ సినిమాను యూత్ కు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో అల్లు శిరీష్ పాల్గొన్నాడు. అనంతరం దుర్గమ్మను దర్శించుకుని సినిమా విజయవంతం కావాలని కోరుకున్నాడు. ఆ తర్వాత విజయవాడ పట్టణంలోని 'ఎస్ఎస్ఎస్' ఇడ్లీ సెంటర్ కు వెళ్లి టిఫిన్ చేశాడు. ఈ టిఫిన్ సెంటర్లో పలువురు స్టార్స్ సైతం గతంలో అల్పాహార భోజనం చేశాడు. ఈ ప్రాంతంలో ఈ టిఫిన్ చాలా ఫేమస్ అని టాక్.
అల్లు అర్జున్ సైతం 'పుష్ప' షూటింగ్ సమయంలో తూర్పుగోదావరిలో ఓ రోడ్డు పక్కన ఉన్న హోటల్లో భోజనం చేశాడు. ఆ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఇప్పుడు అల్లు శిరీష్ సైతం ఫైవ్ స్టార్ హోటల్లో టిఫిన్ చేయకుండా చాలా సింపుల్ గా ఉండే హోటల్లో టిఫిన్ చేయడం 'అల్లు'వారి సింప్లిసిటీకి అర్థం పడుతోంది.
అల్లు శిరీష్ టిఫిన్ చేస్తున్న వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఇదికాస్తా వైరల్ గా మారింది. అల్లు శిరీష్ సింప్లిసిటీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే చాలా రోజుల నుంచి అల్లు శిరీష్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. 'ఊర్వశివో.. రాక్షసివో' సినిమా అయినా శిరీష్ కు ఆ లోటును తీరుస్తుందో లేదో వేచి చూడాల్సిందే..!