డేట్స్ క్లాష్ కారణంగా ఓ గొప్ప అవకాశాన్ని అల్లు అర్జున్ మిస్ చేసుకున్నాడు. తమిళ అగ్ర హీరో సూర్యతో కలిసి నటించే అవకాశాన్ని వదులుకున్నాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సంజీవ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఏబీసీడీ’కిది రీమేక్. మధుర శ్రీధర్ రెడ్డి - యాష్ రంగినేని నిర్మాతలు.. ఈ సినిమా డేట్స్ క్లాష్ కారణంగా సూర్య సినిమాను వదులుకున్నానని శిరీష్ పేర్కొన్నాడు. నాకు అవకాశం ఇచ్చిన హీరో సూర్య - దర్శకుడు కేవీ ఆనంద్ - లైకా ప్రొడక్షన్స్ కు కృతజ్ఞతలు అని చెప్పాడు.
అల్లు అర్జున్ పొరుగు భాషల్లో మంచి అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఇది వరకే మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి నటించాడు. ఇప్పుడు తమిళంలో మరో భారీ ప్రాజెక్టులో అతడికి చాన్స్ దక్కింది. కానీ సినిమా డేట్స్ క్లాష్ కావడంతో సూర్య సినిమా నుంచి వైదొలిగాడు. అయితే చెన్నై సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రెండు భాషల్లో అయితేనే శిరీష్ నటిస్తానని చెప్పినట్టు తెలిసింది. తమిళంలో ఆర్యను - తెలుగులో శిరిష్ ను సూర్య పక్కన నటింపచేసేందుకు చిత్రం యూనిట్ ప్రయత్నించిందని.. అందుకే అల్లు శిరీష్ ఆ సినిమా నుంచి వైదొలిగినట్లు ప్రచారం జరుగుతోంది.
ఏదీ ఏమైనా మెగా హీరోకు గొప్ప అవకాశం దక్కి ఇలా సూర్య సినిమా నుంచి అర్ధాంతరంగా వైదొలగడం అభిమానులను నిరాశ పరిచింది. అయితే శిరీష్ వైదొలగడానికి గల కారణాలపై అధికారికంగా సూర్య కానీ - దర్శకుడు కేవీ ఆనంద్ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.