తనకున్న అనుభవంతో సినిమా రిజల్ట్ ను కొంత వరకూ అంచనా వేయగలడు అల్లు అరవింద్. అందుకే ఆయన బ్యానర్ లో తెరకెక్కే సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటాడు. అయితే లేటెస్ట్ గా 'గీతా ఆర్ట్స్ 2' లో ఆయన సమర్పకుడిగా వ్యవహరించిన 'ప్రతి రోజు పండగే' మీద మాత్రం ఆయనకు చాలా అనుమానాలు ఉండేవట. వాటన్నిటినీ లేటెస్ట్ గా ఓ ఈవెంట్ లో బయట పెట్టాడు.
ముందుగా మారుతి కథ చెప్పేటప్పుడు అసలు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వర్కౌట్ అవుద్దా అనే అనుమానం వ్యక్తం చేసారట. దానికి మారుతి మీకు నచ్చ లేదు అంటే మరో కథ రెడీ చేస్తా అన్నాడట. లేదు లేదు పాయింట్ బాగుంది అని మెల్లగా ఒకే చేసారట. ఇక అక్కడితో ఆగకుండా ఎడిటింగ్ టేబుల్ మీద సినిమా చూస్తూ అసలు యూత్ కి ఎక్కే ఎలిమెంట్స్ ఏం లేవు మనకి డబ్బులు వస్తాయా అని అనుకున్నాడట.
ఫైనల్ గా ఫస్ట్ కాపీ చూసి మనం బాగానే నవ్వుకున్నాం.. ఇక మనకే ఇంత నవ్వోస్తుందా లేదా జనాలు కూడా ఇలాగే థియేటర్ లో నవ్వుకుంటారా అని అనుమాన పడ్డారట. అయితే ఫైనల్ గా తనకున్న ఇలాంటి అనుమానాలన్నీ పటాపంచలు చేసారని ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాడు మెగా నిర్మాత.