మెగా టీంలో ఒకడిగా మొదలైన బన్నీ ప్రయాణం.. కొంత కాలం నుంచి అంతకు మించిన అన్నట్లుగా మారటం తెలిసిందే. ఇదే విషయాన్ని చెప్పేలా అతడి మాటలు.. చేష్టలు చెప్పేస్తున్నాయి. అదేమైనా తప్పా? అంటే తప్పా? అంటే.. అలా అనలేం కానీ.. తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తున్నాడని మాత్రం చెప్పొచ్చు. తానెంత బిజీగా ఉన్నా.. స్నేహం కోసం.. తనను ఇష్టపడే వారు సాయం అడిగితే.. కాదనకుండా వారికి అవసరమైనది చేసి పెడతానన్న విషయాన్ని చేతల్లో చూపించి.. మాటల్లో చెప్పుకొచ్చారు అల్లుఅర్జున్.
ఈ వారం విడుదల కానున్న మూవీ 'అల్లూరి'. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ మూవీలో కయాదు లోహార్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు బన్నీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బన్నీ.. తనకు ఇష్టమైన వ్యక్తి శ్రీవిష్ణు అని చెప్పుకొచ్చారు. ప్రేమ్ ఇష్క్ కాదల్ లో ముగ్గురు హీరోలు ఉంటే.. శ్రీవిష్ణుది ఒక పాత్ర అని.. అతను చాలా బాగా చేశాడని.. అప్పటి నుంచి అతడంటే తనకు ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడిందన్నారు.
అప్పటి నుంచి అతడి సినిమాల్ని తాను గమనిస్తున్నానని.. అతడికొక మంచి అభిరుచి ఉంటుందన్న బన్నీ.. తాను పుష్ప2తో బిజీగా ఉన్నట్లు చెప్పారు. 'ఇక వేడుకలకు వెళ్లకూడదనుకున్నా. శ్రీవిష్ణు ఇప్పటివరకు నన్నెప్పుడూ సాయం అడగలేదు. తన సినిమాను తాను సరిగా ప్రచారం చేసుకోవటం లేదన్నాడు. మీరు వస్తే నాకు చాలా మేలు అవుతుంది అన్నాడు. అప్పుడే వేడుకకు రావాలనుకున్నా. ఈ మూవీ ప్రేక్షకుల మెప్పు పొందాలని కోరుకుంటున్నా' అని పేర్కొన్నారు అల్లు అర్జున్.
కరోనా తర్వాత అంతా సినిమాల గురించి మాట్లాడుతున్నారని.. సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించే విషయంలో చిన్నా.. పెద్ద అనే తేడా లేదని.. సినిమా బాగుంటే ఆదరిస్తున్నారన్నారు.
సినిమాల పరంగా మంచి ట్రెండ్ లో ఉన్నామని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్న బన్నీ.. అల్లూరు సక్సెస్ మీద ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. సాయం చేయమని అడిగిన విషయాన్ని బన్నీ కాకుండా.. హీరోనో.. దర్శకుడో చెప్పి ఉంటే బాగుండేది. ఈ విషయంలో బన్నీ కాస్త ఆలోచిస్తే బాగుంటుందేమో?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.