కొన ఊపిరి వరకు సినిమాలు చేస్తా : బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మించారు.
నందమూరి బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మించారు. శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతెలా ఫిమేల్ లీడ్స్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతికి రిఈజై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా విజయోత్సవ సభ అనంతపురంలో జరిగింది. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ ఎనర్జిటిక్ స్పీచ్ ఫ్యాన్స్ ని ఖుషి చేసింది.
మైక్ అందుకుని తన స్టైల్ లో తిప్పుకుంటూ పట్టుకున్న బాలయ్య ఆదిత్య 369 లో ఒక పాత్ర గురించి బాబీతో డిస్కస్ చేసి డాకు మహారాజ్ సినిమా చేశామని అన్నారు. అభిమానులను కాలర్ ఎగరేసి గర్వపడేలా చూసుకునే బాధ్యత తన మీద ఉందని.. ఇంతపెద్ద కుటుంబాన్ని ఇచ్చిన తండ్రి గురువు దైవం నందమూరి తారాకరామా రావు గారిని గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ. అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్లు ఎప్పుడూ గుండెల్లో ఉంటారని అన్నారు బాలయ్య.
ఆదిత్య 369 గెటప్ అలా మైండ్ లో ఉండిపోయింది.. అది బాబీకి చెప్పడంతో కథ రెడీ చేశారు. నాగ వంశీ వరుస సక్సెస్ లతో పరిశ్రమకు మంచి చేస్తున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి తర్వాత డాకు మహారాజ్ తో వరుసగా నాలుగో విజయం అందుకున్నామని.. కొన ఊపిరి వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని అన్నారు బాలకృష్ణ. అన్ని రకాల సినిమాలు.. వైవిద్య పాత్రలు చేస్తానని అన్నారు. అభిమానులే నా ప్రచార కర్తలని అన్న బాలయ్య నా రికార్డులన్నీ ఒరిజినల్ అని అది వాళ్లకు కూడా తెలుసని అన్నారు.
ఒక సినిమా సక్సెస్ అయితే ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది. సినిమాకు పనిచేస్తున్న వారు, ఎగ్జిబిటర్స్ ఇలా అందరు బాగుంటారని అన్నారు బాలకృష్ణ. డైరెక్టర్ బాబీ అందరి దగ్గర నుంచి పనితనాన్ని రాబట్టుకున్నాడు. ఆయన కూడా హీరోగా యాక్టింగ్ చేయొచ్చు అంత స్టైల్ గా ఉన్నాడు. తనని సినిమాలో బాగా చూపించాడని అన్నారు బాలయ్య.
ఒక సినిమాకు సంగీతం హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్టే.. థమన్ మ్యూజిక్ తో స్పీకర్లు, ఊఫర్లు బ్లాస్ట్ అవుతున్నాయి. థమన్ బాధ్యతగా సంగీతం అందించాడు. అతనికి నా ఆశీస్సులు అని అన్నారు బాలకృష్ణ. విజువల్స్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అన్న రేంజ్ లో ఉన్నాయని దానికి కెమెరా మెన్ పనితనం సూపర్ అని అన్నారు. తన కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు చాలానే ఉన్నాయని వాటిలో డాకు మహారాజ్ ఒకటని అన్నారు బాలయ్య.
సినిమాలో నటించిన శ్రద్ధ, ప్రగ్యా గురించి కూడా మాట్లాడారు బాలకృష్ణ. ఇద్దరు బాగా చేశారని. ఊర్వశి కూడా తన డ్యాన్స్ తో మెప్పించిందని అన్నారు. యానిమల్ కన్నా ముందే బాబీ డియోల్ ని తీసుకున్నామని.. సినిమా నేపథ్యానికి అతను బాగా సూట్ అయ్యాడని అన్నారు బాలయ్య.
తన అభిమానులను ఉద్దేశించి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు మళ్లీ క్షేమంతా ఇంటికి వెళ్లాలని సూచించారు బాలయ్య. తన ఫ్యాన్స్ తన కను సైగ చేస్తే అర్ధం చేసుకుంటారని అన్నారు.