ఇలాంటి సినిమాలు వాళ్లకే సాధ్యం..!

ముఖ్యంగా యువ రచయితలు, దర్శకులు మలయాళ పరిశ్రమలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ కంటెంట్ ఉన్న సినిమాలను అందిస్తున్నారు.;

Update: 2025-03-18 20:30 GMT

అదేంటో టెక్నికల్ గా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ హాలీవుడ్ రేంజ్ లో మిగతా భాషల సినిమాలు ఉంటే వాటికి పోటీగా కంటెంట్ ఉన్న సినిమాలతో సర్ ప్రైజ్ చేస్తుంటారు మలయాళ సినీ మేకర్స్. మలయాళంలో ఒక సినిమా వస్తుంది అంటే అది కచ్చితంగా కొత్త పాయింట్ తోనే వస్తారన్న మార్క్ బలంగా పడేలా చేసుకున్నారు. ముఖ్యంగా యువ రచయితలు, దర్శకులు మలయాళ పరిశ్రమలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ కంటెంట్ ఉన్న సినిమాలను అందిస్తున్నారు.

ఈమధ్య కాలంలో అక్కడ బసిల్ జోసెఫ్ అనే ఫిల్మ్ మేకర్ ఇలాంటి సినిమాలను అందిస్తున్నాడు. అతను డైరెక్టర్ గానే కాదు నటుడిగా కూడా మెప్పిస్తున్నాడు. లేటెస్ట్ గా బసిల్ జోసెఫ్ నటించిన పొన్ మ్యాన్ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. పొన్ మ్యాన్ కథ వింటే ఏంటి ఇలాంటి కథతో కూడా సినిమా చేస్తారా అన్నట్టుగా ఉంటుంది. పెళ్లిళ్లకు నగలు అప్పుగా ఇచ్చే అజేష్ ఒక పెళ్లిలో తన నగలకు తగిన సొమ్ము తిరిగి రాకపోవడంతో ఆ ఫ్యామిలీకి ఇతనికి మధ్య జరిగిన సంఘర్షణ నేపథ్యంతో పొన్ మ్యాన్ సినిమా వచ్చింది.

కథలు సహజంగా ఉండటమే కాదు రాసుకున్న కథకు తగిన కథనం అందులో నటించే నటీనటులు కూడా ఇంప్రెసివ్ గా నటిస్తారు. అందుకే మలయాళ సినిమాలు ఎప్పుడూ టాప్ లో ఉంటాయి. ముఖ్యంగా ఓటీటీలో ఏదైనా మలయాళ సినిమా వచ్చింది అంటే రెగ్యులర్ సినీ లవర్స్ అయితే తప్పకుండా చూసేస్తారు.

అక్కడ మేకర్స్ ఎలాంటి జోనర్ కథ రాసుకున్నా దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు. ముఖ్యంగా కథకు ఏమాత్రం అవసరం లేని కమర్షియల్ అంశాలను పొందుపరచరు. అందుకే అక్కడ నుంచి వచ్చే సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ క్రేజ్ ఉంటుంది. క్రైమ్, కామెడీ, ఎమోషనల్, యాక్షన్ ఇలా ఎలాంటి సినిమాతో వచ్చినా ప్రత్యేకత చూపిస్తారు.

పొన్ మ్యాన్ లాంటి కథలు తెలుగులో సాధ్యం కాదా అంటే వస్తాయి కానీ ఇక్కడ కేవలం కంటెంట్ మీదే నడిపించే సినిమాలు చాలా తక్కువ కనిపిస్తాయి. ఐతే మలయాళంలో వచ్చే ఇలాంటి సినిమాలు చూసి మాత్రం తెలుగులో ఇలా ఎందుకు ప్రయతించరు అనే మాట మాత్రం వినిపిస్తుంది. పొన్ మ్యాన్ లాంటి సినిమాలు కేవలం మలయాళ మేకర్స్ కి మాత్రమే సాధ్యం అనేలా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఐతే ఈ సినిమాలు భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ అందరినీ అలరిస్తున్నాయి.

Tags:    

Similar News