మెగాస్టార్ - స్టైలిష్ స్టార్ కాంబోలో నిజమెంత...!

Update: 2020-04-21 23:30 GMT
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన కెరీర్లో 152వ చిత్రం 'ఆచార్య'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత 'లూసిఫర్' అనే మలయాళ మూవీని చిరు తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. 'ఆచార్య'లో రామ్ చరణ్ తో నటిస్తున్న చిరంజీవి.. 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో అల్లు అర్జున్ తో కలిసి నటిస్తున్నాడంటూ గత కొన్ని రోజులుగా న్యూస్ వస్తున్న విషయం తెలిసిందే. మన తెలుగు మీడియాతో పాటు తమిళ మలయాళ ఇండస్ట్రీలలో కూడా ఈ వార్తపై కోడైకూశాయి. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడని.. మలయాళ 'లూసిఫర్' హీరో పృథ్వీరాజ్ పోషించిన పాత్రలో బన్నీ నటిస్తున్నాడంటూ రూమర్స్ వచ్చాయి. మలయాళ 'లూసిఫర్'లో హీరోకి నమ్మకంగా ఉంటూ అతని ప్లాన్స్ ని అమలుపరిచే ఒక షార్ప్ షూటర్ పాత్ర అది. అదే పాత్రను తెలుగులో అల్లు అర్జున్ చేస్తే బాగుంటుందని చిరంజీవి కూడా భావిస్తున్నాడని ఇప్పటికే పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలో నిజమెంత అనే విషయంపై ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

కాగా అల్లు అర్జున్ సోషల్ మీడియా టీమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అల్లు అర్జున్ అలాంటి పాత్రలో నటిస్తున్నట్లు గానీ.. అసలు ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి డిస్కషన్స్ కానీ జరగలేదట. అవనీ పుకార్లేనని బన్నీ ప్రస్తుతం తన 'పుష్ప' సినిమాలో చిత్తూరు యాస నేర్చుకోవడంపై ఫోకస్ పెట్టాడని తెలిపారంట. అయితే నిజానికి అలాంటి పాత్రకి బన్నీ అయితే న్యాయం జరుగుతుందని మెగా అభిమానుల అభిప్రాయం. డాడీ తర్వాత ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మామా అల్లుళ్ళ కాంబినేషన్‌ కుదిరితే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా 'లూసిఫర్' తెలుగు రీమేక్‌కు 'సాహో' డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ఇప్పటికే తెలుగు వర్షన్‌లో ఇక్కడ నేటివిటీకి తగ్గట్లు తగినన్ని మార్పులు చేస్తూన్నడట సుజీత్. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించనున్నాడు. 'ఆచార్య' మూవీ చిత్రీకరణ పూర్తి కాగానే చిరంజీవి ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.
Tags:    

Similar News