ఈ రోజుల్లో ఒక్క హిట్టు కొట్టడం కొంత మంది హీరోలకు గగనం గా మారింది. అలాంటిది వరుసగా మూడు హిట్ లని సొంతం చేసుకుని హ్యాట్రిక్ హిట్ ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే ముగ్గురు టాలీవుడ్ హీరోలు హ్యాట్రిక్ హిట్ లని దక్కించుకోవడమే అరుదు అంటే ఏకంగా డబుల్ హ్యాట్రిక్ హిట్ ని దక్కించుని అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నారు. ఇలా డబుల్ హ్యాట్రిక్ హిట్ ని అందుకున్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ వున్నారు.
వరుసగా రెండు హిట్ లని సొంతం చేసుకోవడానికే ఆపసోపాలు పడుతుంటే ఈ ముగ్గురు హీరోలు మాత్రం వరుసగా ఆరు సక్సెస్ లని సొంతం చేసుకుంటూ డబుల్ హ్యాట్రిక్ హిట్ ని దక్కించుకుని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇత టఫ్ టాస్క్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని, అడివి శేష్ కూల్ గా ఫినిష్ చేయడం విశేషం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ `దమ్ము` నుంచి `రభస` వరకు వరుస ఫ్లాపుల్ని చూశారు. ఆ తరువాత టెంపర్, నాన్నాకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, RRR వరకు వరుసగా ఆరు హిట్ లని తన ఖాతాలో వేసుకున్నారు.
ఈ వరుస హిట్లతో ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ హిట్ లని సొంతం చేసుకున్న ఘనతని సాధించడం విశేషం. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో తన 30 వ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కబోతోంది. ఇక ఎన్టీఆర్ తరువాత నేచురల్ స్టార్ నాని వరుసగా ఆరు విజయాల్ని దక్కించుకున్నారు. పైసా నుంచి జెండాపై కపిరాజు వరుకు వరుస ఫ్లాపుల్ని చూసిన నాని ఆ తరువాత `ఎవడే సుబ్రమణ్యం` నుంచి హిట్ బాట పట్టాడు. భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్ మన్, మజ్ను, నేను లోకల్ వరకు వరుసగా ఆరు విజయాల్ని సొంతం చేసుకున్నారు.
దీంతో నాని కూడా డబుల్ హ్యాట్రిక్ ఫీట్ ని సాధించిన హీరోగా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇక ఈ ఇద్దరు హీరోల తరువాత ఇదే ఫీట్ ని రిపీట్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్. తనే కథ అందించి నటించిన `క్షణం`తో అడివి శేష్ హిట్ ల ప్రయాణం మొదలైంది. ఆ తరువాత ఇంద్రగంటి మోహన కృష్ణ రూపొందించిన `అమీ తుమీ`, శశి కిరణ్ తిక్క `గూఢచారి`, వెంకట్ రామ్ జీ రూపొందించిన `ఎవరు`, సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా శశికిరణ్ తిక్క తెరకెక్కించిన `మేజర్` రీసెంట్ గా `హిట్ 2`లో డబుల్ హ్యాట్రిక్ హిట్ లని తన ఖాతాలో వేసుకోవడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.