అందం, ఆశయం, అమ్మ.. దటీజ్ అమల

Update: 2016-09-13 05:34 GMT
అక్కినేని అమల సెప్టెంబర్ 12న పుట్టిన రోజు జరుపుకున్నారు. భరతనాట్య కళాకారిణిగా ప్రారంభించి.. తర్వాత నటిగా ఎదిగి.. పలు భాషల్లో సినిమాలు చేసి.. అక్కినేని ఇంటికి కోడలిగా వచ్చి.. ఇప్పుడు అఖిల్ అమ్మగాను.. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా బాధ్యతలు నిర్వహించడంలోనూ అమల ఎంతో చొరవచూపుతారు.

వీటన్నిటి కంటే అమల అనే పేరు చెప్పగానే గుర్తొచ్చే మరో విషయం బ్లూక్రాస్. మూగ జీవాలను సంరంక్షించే ఆశయంతో ఏర్పాటైన ఈ సంస్థ.. ఇప్పటికి 4 లక్షలకు పైగా జీవాలను కాపాడిందంటే ఆశ్చర్యం వేయడం సహజం. ఆరేళ్లవయసులో ఓ కాకికి దెబ్బతగిలి పడిపోతే.. ఇంటికి తీసుకొచ్చ కట్టుకట్టి చికిత్స చేయడంతో మొదలైన ఈ ప్రేమ.. అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పెళ్లయ్యాక నాగ్ నుంచి పూర్తి మద్దతు లభించడంతో.. ఇది ఓ స్వచ్ఛంద సంస్థగా రూపాంతరం చెంది సేవలను విస్తృతం చేయగలిగింది.

హైద్రాబాద్ వచ్చిన కొత్తలో ట్రక్ ఢీ కొట్టడంతో ఓ జంతువు గాయాల పాలు కాగా.. దాన్ని ఇంటికి తీసుకొచ్చి చికిత్స చేశారట అమల. అప్పుడు ఆమెలోని జంతుప్రేమను చూసిన నాగ్.. హైద్రాబాద్ లో బ్లూక్రాస్ ఏర్పాటు.. చెన్నైలో శిక్షణ తీసుకోవడంలో ఎంతో చొరవ చూపించారని చెబుతున్నారు అమల. ఇప్పుడు అమ్మగా అఖిల్ కి మరెంతో భవిష్యత్తు అందించేందుకు కృషి చేస్తున్నారు.

Tags:    

Similar News