అమ్మ కరుణపై అమల కామెంట్స్

Update: 2018-07-02 07:04 GMT

ప్రస్తుతం దేశమంతటా మలయాళంకు సంబందించిన అమ్మ అసోసియేషన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. లైంగిక వేధింపుల విషయంలో హీరోయిన్స్  నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న నటుడు దిలీప్ పై ఇటీవల అమ్మ కరుణ చూపటం వైరల్ గా మారింది. ఇప్పటికే చాలా మంది నటి నటులు దిలీప్ పై ఎత్తివేసిన నిషేధంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రస్తుతం అమ్మకు అధ్యక్షుడిగా మోహన్ లాల్ ఉన్నాడు. రాజకీయ ఒత్తిడిల వల్లే మలయాళం అసోసియేషన్ దిలీప్ కు మళ్ళీ సభ్యత్వాన్ని ఇచ్చిందని కామెంట్స్ వస్తున్నాయి.

అయితే సీనియర్ హీరోయిన్స్ అమ్మ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఇక అక్కినేని ఇల్లాలు నాగార్జున సతీమణి అమలా అక్కినేని కూడా ఈ విషయంపై స్పందించారు. మలయాళం అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఎంత మాత్రం కరెక్ట్ కాదని సోషల్  మీడియా ద్వారా సమాధానం ఇచ్చారు. మహిళలు వారి సంరక్షణ కోసం కోరుకుంటున్న హక్కుల కోసం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇండియా ఇది అర్ధం చేసుకోవాలని కూడా తెలిపారు.

ఇక మరోవైపు దిలీప్ తనపై ఎత్తివేసిన నిషేధానికి ఊహించని విధంగా సమాధానం ఇచ్చాడు. తనపై అనవసరంగా ఆరోపణలు చేసి కేసులో ఇరికించారని చెబుతూ.. మళ్ళీ కోర్టులో నిర్దోషిని అని తేలేవరకు అమ్మలో అడుగు పెట్టనని సమాధానం ఇవ్వడం గమనార్హం. ఇక ఈ వివాదాల కారణంగా అమ్మ అధ్యక్షుడు మోహన్ లాల్ ఎప్పుడు లేని విధంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు.


Tags:    

Similar News