సినీ నటిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అక్కినేని నాగార్జునని పెళ్లి చేసుకున్న అమల ప్రస్తుతం వెండి తెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో శేఖర్ కమ్ముల - లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో ఒక మంచి పాత్ర చేసిన అమల అక్కినేని మనం సినిమాలో కూడా అలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆమె అక్కినేని కోడలి గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ యాక్టివిటీస్ లో కూడా తరచు పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా పర్యావరణానికి సంబందించిన కార్యక్రమాలలో అమల గారు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఆమెకు ఎన్నో అవార్డులు కూడా అందాయి.
విషయం ఏంటంటే.. ఇప్పుడు బాలల చిత్రోత్సవం సందర్బంగా ఉత్తమ సినిమాల్ని ఎంపిక చేసేందుకు 19 మంది సభ్యులున్న జ్యూరీని ప్రకటించారు. అందులో అమలను కూడా ఎంపిక చేశారు. నవంబర్ 8 నుంచి 14 వరకు 20వ అంతర్జాతీయ బాలల దినోత్సవాన్నీ ఈ సారి కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. అయితే ఉత్తమ బాలల సినిమాలను ఎంపిక చేసేందుకు తెలుగు వారితో పాటు అమెరికా - స్పెయిన్ అలాగే జర్మనీ ఇంకా ఉక్రెయిన్ తదితర దేశాల ప్రతినిధులు కూడా ఉంటారు. ఈ జ్యురిలో అక్కినేని అమలతో పాటు దర్శకుడు ప్రభాకర్ జైని - నిర్మాత పద్మిని నాగులపల్లి తో పాటు ఇతర ప్రముఖులు కూడా ఉన్నారులే.