ఛాలెంజ్ అనే పేరు వినగానే సినీప్రియులు చాలామంది 'యురేకా సకామికా' అంటూ మెగాస్టార్ ఆలోచనల్లోకి వెళ్ళిపోతారు. ఇక కార్పోరేట్ ఆఫీసుల్లో పనిచేసే కొందరేమో స్వొట్ అనాలిసిస్ లో ఉండే ఛాలెంజ్ అనుకుంటారు. కానీ ఇవన్నీ చాలా పాత ఆలోచనలు. ఛాలెంజ్ అంటే ఇప్పుడు రీడింగ్ ఈజ్ గుడ్ ఛాలెంజ్. స్వచ్ఛ భారత్ ఛాలెంజ్..కికి ఛాలెంజ్.. హగ్ ఎ ట్రీ ఛాలెంజ్.. ఇవన్నీ పాతబడిపోయాయి. ఈమధ్య సెలబ్రిటీలు కొత్తగా ఈ రీడింగ్ ఈజ్ గుడ్ చాలెంజ్ ను మొదలు పెట్టారు.
మరి ఈ ఛాలెంజ్ ఎక్కడ మొదలైందో తెలీదు కానీ ప్రస్తుతం అక్కినేని అమల గారి దగ్గరకు వచ్చింది. రామ్ ప్రసాద్ అనే వ్యక్తి అమల గారిని ఛాలెంజ్ చేయడంతో ఆవిడ దాన్ని స్వీకరించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ విషయాన్ని తెలుపుతూ " రామ్ ప్రసాద్ గారి 'రీడింగ్ ఈజ్ గుడ్ ఛాలెంజ్' ను నేను స్వీకరించాను. నేను 'స్టోరీస్ ఎట్ వర్క్' అనే పుస్తకాన్ని చదువుతానని హామీ ఇస్తున్నాను. ఈ ఛాలెంజ్ కు సమంతా అక్కినేని.. సుమంత్.. ఉపాసన కొణిదెల ను నామినేట్ చెస్తునాను." అంటూ ఒక ఫోటో పోస్ట్ చేశారు.
మరి ఈ రీడింగ్ ఈజ్ ఎ గుడ్ ఛాలెంజ్ కు సమంతా.. ఉపాసన.. సుమంత్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ ఛాలెంజ్ అందరికీ సూట్ అయ్యేది కాదు కాబట్టి కికీ లా సంచలనం సృష్టించే అవకాశాలు తక్కువ. ఏదేమైనా టైం పాస్ ఛాలెంజ్ ల కంటే ఇలాంటి అర్థవంతమైన ఛాలెంజ్ లు మంచిదే కదా.