ఇది అందరికీ తెలిసిన విషయమే. నాగచైతన్య నాగార్జున కొడుకు. అమల కొడుకు కాదు. చైతూ నాగార్జున మొదటి భార్య లక్ష్మి కొడుకు. ఆమె రామానాయుడు కుమార్తె. లక్ష్మితో విడాకులు తీసుకున్నాక నాగ్.. అమలను పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహ బంధం 23 ఏళ్లుగా అన్యోన్యంగా సాగుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చైతూ మీకు తల్లి స్థానాన్ని ఇస్తాడా అని అడిగితే.. ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది అమల.
''అలా ఎదురు చూడటం తప్పు. ఎందుకంటే తనకు తల్లి ఉంది. ఆ అమ్మ స్థానాన్ని నేను లాక్కోలేను. చైతన్య మా కుటుంబ సభ్యుడే. అతను వండర్‌ఫుల్ బాయ్'' అని చెప్పింది అమల. తనకు అమ్మ, నాన్న, బ్రదర్, సిస్టర్‌తో పాటు స్టెప్ మదర్ కూడా ఉందని.. తనకు తల్లి ఉంది కాబట్టి స్టెప్‌మదర్‌ను తల్లిగా అంగీకరించలేనని.. ఆవిడ కూడా తన తల్లి స్థానాన్ని లాక్కోవడానికి ప్రయత్నించలేదని చెప్పింది అమల. తన కుటుంబ సభ్యులతో నాగ్ చాలా బాగా ప్రవర్తిస్తాడని.. ఇంటికి వచ్చినపుడు చాలా కేరింగ్‌గా ఉంటాడని.. వారి నుంచి ఏమీ ఆశించడని అమల అంది. అక్కినేని కుటుంబంలో కలిసిపోవడానికి తాను ఎలాంటి ఇబ్బందులూ పడలేదని.. మావయ్య ఏఎన్‌ఆర్ నాగ్‌తో తన బంధాన్ని చక్కగా అర్థం చేసుకున్నారని.. అత్తయ్య అన్నపూర్ణ తనకు తెలుగు సంప్రదాయాల్ని, భాషను నేర్పిందని చెప్పింది అమల.