అమలాపాల్ పెళ్లి చేసుకొంటుందని తెలియగానే కుర్రాళ్లు తెగ ఫీలైపోయారు. అంత మంచి అందాన్ని ఇక తెరపై చూడలేమేమో అని భాదపడ్డారు. ఆమె కూడా `ఇక పెళ్లి తర్వాత నటించనేమో` అని ఒకట్రెండు సార్లు మీడియా ముందు చెప్పింది. భర్త విజయ్ దర్శకుడే అయినా, ఆయన్నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోయినా అమలాపాల్ మాత్రం సినిమాలు చేయడం డౌటే అన్న సిగ్నల్ ఇవ్వడంతో ఆమెకే నటించడం ఇష్టం లేదేమో అనుకొన్నారంతా. పెళ్లి తర్వాత చేతిలో ఉన్న సినిమాలన్నీ కంప్లీట్ చేయడంపై దృష్టిపెట్టింది. ఆ సినిమాలు పూర్తయితే ఇక కొత్తవి ఒప్పుకోదేమో అనుకొన్నారంతా. కానీ అమలాపాల్ ఇటీవల తన నిర్ణయం మార్చుకొన్నట్టు సమాచారం. మంచి అవకాశాలు వస్తున్నంత వరకు కెరీర్ కంటిన్యూ చేయాలనుకొని డిసైడ్ అయినట్టు సమాచారం. అందుకే ఇటీవల దుబాయ్ లో జరిగిన సైమాలో పాల్గొని అదరగొట్టింది.
పెళ్లయినా ఇంకా నాలో ఊపు తగ్గలేదన్నట్టుగా స్టేజీపై డ్యాన్స్ ఇరగదీసింది. ఆమె పెర్ ఫార్మెన్స్ సైమాకి వచ్చినవాళ్లందరినీ ఆకట్టుకుందట. సౌత్ ఇండస్ట్రీ మొత్తం హాజరయ్యే ఆ వేడుకలో తాను డ్యాన్స్ పెర్ ఫ్మార్మెన్స్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి మరీ స్టేజీ పైకి ఎక్కిందట అమలా. పరిశ్రమ వర్గాల దృష్టిలో పడటానికే ఆమె ఆ ప్రయత్నం చేసినట్టు చెప్పుకొంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పలువురు స్టార్ కథానాయకులతో కలిసి నటించింది అమలాపాల్. ఇకపై కూడా రెండు భాషల్లో మంచి అవకాశాలొస్తే నో చెప్పకుండా నటించేయాలని ఆమె డిసైడ్ అయ్యిందట. భర్త విజయ్ కూడా ఆమెకి ఏమాత్రం అభ్యంతరం చెప్పడం లేదట. డైరక్టర్లు అమలాపాల్ కి కబురు పెట్టడమే ఆలస్యం మరి! సూర్య తో కలిసి అమలాపాల్ నటించిన `హైకూ` త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.