హీరోయిన్ అమలా పాల్ ఈ మధ్యనే అఫీషియల్ గా దర్శకుడు ఏ.ఎల్. విజయ్ దగ్గరనుండి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న సాయంత్రం అమల చెన్నయ్ లో ఒక యాడ్ ఫిలిం కోసం షూట్ చేస్తుండగా వచ్చిన ఒక మెసేజ్.. అమ్మడును చాలా ఎమోషనల్ గా కలచి వేసిందని తెలుస్తోంది. ఇంతకీ ఏంటా మెసేజ్?
మొన్ననే నెల క్రితం విడాకులు తీసుకున్న దర్శకుడు విజయ్ ఇప్పుడు రెండో వివాహం చేసుకుంటున్నాడట. 2011లో విజయ్ అండ్ అమల ప్రేమ కథ మొదలైంది. వారు 2014 జూన్ లో పెళ్ళిచేసుకున్నారు. ఆ తరువాత అమల తిరిగి సినిమాల్లో నటించడం అత్తింటివారికి ఇష్టం లేకపోవడంతో.. ఇక గొడవలు మొదలైపోయాయ్. చివరకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. అయినాసరే తనకు విజయ్ అంటే చాలా ఇష్టమని ఈ మధ్యనే ఒక ఇంటర్యూలో అమల వివరించింది.
అయితే నిన్న సడన్ విజయ్ రెండో పెళ్ళి గురించి న్యూస్ రావడంతో.. తీవ్ర ఉద్వేగానికి లోనైందట. ప్రశాంతంగా షూటింగ్ లో పాల్గొనలేక డిస్ట్రబ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా కూడా ఒకసారి డైవర్స్ అయ్యాక ఇక లైఫ్ లో ముందుకుసాగిపోవాలి కదా అమలా? ఎందుకిలా నిన్ను నువ్వు బాధించుకుంటున్నావు? అంటూ ఆమె సన్నిహితులు ఆమెను ప్రశ్నిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/