అల్లు అర్జున్ వివాదం.. అన్ని సినిమాలను సైడ్ చేసిందిగా..!

అల్లు అర్జున్ వివాదం నడుస్తున్న సమయంలోనే.. టాలీవుడ్ లో అనేక విషయాలు జరిగాయి. బన్నీని శుక్రవారమే అరెస్ట్ చేయడంతో, ఆ వారంలో రిలీజైన సినిమాలను జనాలు పట్టించుకోలేదు.

Update: 2024-12-25 04:15 GMT

ఇప్పుడు ఎక్కడ చూసినా సినీ హీరో అల్లు అర్జున్ వివాదం గురించే మాట్లాడుకుంటున్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి.. బన్నీ కేసు పూర్వాపరాలపైనే చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొందరు రాజకీయ నాయకులు అల్లు అర్జున్ కి సపోర్ట్ గా మాట్లాడటం, దానికి కౌంటర్ గా మరికొందరు పొలిటిషయన్స్ మాట్లాడటం.. ఇలా గత కొన్ని రోజులుగా ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. ప్రాంతీయ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకూ అందరూ ఈ విషయం మీదనే డిస్కషన్స్ పెడుతున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ డైలీ ఈ టాపిక్కే ట్రెండింగ్ లో ఉంటోంది. దీంతో మిగతా విషయాలన్నీ సైడ్ అయిపోతున్నాయి. ముఖ్యంగా సినిమాలకి సంబంధించిన విషయాల మీద పెద్దగా చర్చలు జరగడం లేదు.

గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ వివాదానికి రిలేటెడ్ గా వచ్చే వార్తలే వైరల్ అవుతున్నాయి. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చేయడం, అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం, వెంటనే ఆయన జైలు నుంచి బయటకు రావడం, ఆ తర్వాత బన్నీకి సినీ ప్రముఖుల పరామర్శలు, తెలంగాణా అసెంబ్లీలో సీఎం రేవంత్ కేసు గురించి మాట్లాడటం, అనంతరం బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం, ఇదే క్రమంలో పోలీసుల ప్రెస్ మీట్, అల్లు అర్జున్ మీద పలువురు నేతలు విమర్శలు చేయడం, ఆసుపత్రిలో ఉన్న రేవతి కుమారుడిని పరామర్శించడం, అధికారిక ప్రతిపక్ష నాయకుల పరస్పర వ్యాఖ్యలు, పోలీసులు మళ్ళీ బన్నీని విచారణకు పిలవడం.. ఇలా వార్తలన్నీ ఈ వివాదం చుట్టూనే తిరుగుతున్నాయి.

అల్లు అర్జున్ వివాదం నడుస్తున్న సమయంలోనే.. టాలీవుడ్ లో అనేక విషయాలు జరిగాయి. బన్నీని శుక్రవారమే అరెస్ట్ చేయడంతో, ఆ వారంలో రిలీజైన సినిమాలను జనాలు పట్టించుకోలేదు. అసలు ఏయే చిత్రాలు విడుదలయ్యాయనే సంగతే తెలియలేదు. ఈ గ్యాప్ లో సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ కూడా షురూ అయ్యాయి. 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో గ్రాండ్ గా నిర్వహించారు. రామ్ చరణ్, శంకర్, సుకుమార్, దిల్ రాజు, బుచ్చిబాబు.. ఇలా పలువురు సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. దోప్ అనే సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ వాటి గురించి పెద్దగా డిస్కషన్ జరగలేదు.

అలానే హైదరాబాద్ లో 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమా నుంచి ఒక పాటను కూడా విడుదల చేశారు. మరోవైపు 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ నుంచి సెకండ్ సాంగ్ వచ్చింది. కానీ అల్లు అర్జున్ వార్తల నడుమ సినీ అభిమానులు ఈ అప్డేడ్స్ ను పట్టించుకోలేదు. అంతెందుకు 'పుష్ప 2: ది రూల్' సినిమా రికార్డుల గురించి కూడా మాట్లాడుకోవడం లేదు. బాక్సాఫీస్ దగ్గర రూ.1700 కోట్లు కలెక్ట్ చేసినా.. 700 కోట్లతో వందేళ్ల హిందీ చిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించినా.. 'బాహుబలి 2' రికార్డులను బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతున్నా అభిమానులు వీటిపై ఆసక్తి కనబరచడం లేదు.

ఇక క్రిస్మస్ కి రిలీజ్ అయ్యే సినిమాల సంగతి సరే సరి. ప్రమోషనల్ కంటెంట్ అసలు జనాల్లోకి వెళ్ళ లేదు. సాంగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ అంటూ హడావుడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ.. సినీ అభిమానుల్లో డిస్కషన్ జరగడం లేదు. ప్రజలు ఎక్కువగా అల్లు అర్జున్ వివాదానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో, మీడియా సైతం అదే అంశం మీద ఫోకస్ పెట్టాయి. దీని గురించే వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఇదంతా పరోక్షంగా సినిమాలు, సినీ ఇండస్ట్రీ మీద ప్రభావం చూపిస్తోంది. వీలయినంత త్వరగా ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడితే, సంక్రాంతి సినిమాలకు బజ్ క్రియేట్ అవుతుంది. రిలీజ్ కు ఇంకా గట్టిగా మూడు వారాల టైమ్ కూడా లేదు. చూద్దాం.. ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News