చిరు-బాల‌య్య ఒక‌టైతే...వెంకీ-నాగ్ ఒక్క‌టిగా!

వెంకటేష్ మల్టీస్టార‌ర్ సినిమాలు చేయ‌డం అన్న‌ది ప‌దేళ్ల క్రితం మొద‌లైంది. కానీ నాగ్ అంత‌కు ముందు నుంచే చేస్తున్నారు. అయితే వెంక‌టేష్ -నాగార్జున మాత్రం కలిసి ఇంత‌వ‌ర‌కూ సినిమా చేయ‌లేదు.

Update: 2024-12-25 03:45 GMT

చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్, నాగార్జున ఒకే జ‌న‌రేషన్ హీరోలు. వెంకీ, నాగ్ ల‌కంటే? చిరు బాల‌య్య ఇంకొంచెం సీనియ‌ర్లు. కానీ అప్ప‌ట్లో ఈ న‌లుగురు హీరోల మ‌ధ్య మంచి పోటీ ఉండేది. థియేట‌ర్లో ఆ హీరోల సినిమాలు పోటా పోటీగా రిలీజ్ అయ్యేవి. స్టోరీల ఎంపిక విష‌యంలో హీరోల మ‌ధ్య అప్ప‌ట్లో మంచి పోటీ క‌నిపించేది. ముఖ్యంగా బాల‌య్య‌-చిరు మ‌ధ్యీ పోటీ ఎక్కువ‌గా ఉండేది. అయితే ఇప్పుడంతా మారిపోయింది. హీరోలంతా ఆరోగ్య క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో క‌లిసి మెలిసి ప‌ని చేస్తున్నారు.

ఎవ‌రి మార్కెట్ ఆధారంగా వారు సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. విక్ట‌రీ వెంక‌టేష్ సోలో చిత్రాల్లో న‌టిస్తూనే ఇత‌ర హీరోల‌తో క‌లిసి మల్టీస్టార‌ర్ సినిమాలు కూడా చేస్తున్నారు. కింగ్ నాగార్జున కూడా ఇత‌ర స్టార్స్ తో క‌లిసి నటించ‌డం అన్న‌ది చాలా కాలంగా చేస్తున్నారు. ఆయ‌న హీరోగా న‌టించాల్సిన సినిమాల్లో య‌ధావిధిగా కొన‌సాగుతున్నారు. ఈ విష‌యంలో వెంక‌టేష్ కంటే నాగార్జున ఇంకా ముందున్నారు.

వెంకటేష్ మల్టీస్టార‌ర్ సినిమాలు చేయ‌డం అన్న‌ది ప‌దేళ్ల క్రితం మొద‌లైంది. కానీ నాగ్ అంత‌కు ముందు నుంచే చేస్తున్నారు. అయితే వెంక‌టేష్ -నాగార్జున మాత్రం కలిసి ఇంత‌వ‌ర‌కూ సినిమా చేయ‌లేదు. ఆ ఇద్ద‌ర్నీ ఒకే ప్రేమ్ లో చూడాల‌ని అభిమానులు ఆశ ప‌డుతున్నారు. ఇక చిరంజీవి తో క‌లిసి చాలా మంది హీరోలు క‌లిసి న‌టించారు.

కానీ చిరు పాత్ర‌కు పోటీగా మాత్రం మ‌రో హీరో పాత్ర‌ను డిజైన్ చేయ‌లేదు. అలాంటి సినిమా ఒక‌టి రావాల‌ని అభిమా నులు కోరుకుంటున్నారు. చిరంజీవి-బాల‌య్య క‌లిసి ఓ సినిమా చేయాల‌ని అభిమానులు సైతం ఆశిస్తున్నారు. ఈ అవ‌కాశాన్ని చిరంజీవి బోయ‌పాటి శ్రీనుకు క‌ల్పించారు. ఆ సంద‌ర్భం ఎప్పుడోస్తుందా? అని ఇండ‌స్ట్రీ స‌హా అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News