హార్ట్ టచింగ్ డ్రింకర్ సాయి.. వద్దన్న నాన్నే అలా అనేశారు..!

సింధూరం సినిమాతో తొలి ప్రయత్నం చేసి ఇప్పుడు డ్రింకర్ సాయిగా మలి సినిమాతో రాబోతున్నాడు.

Update: 2024-12-25 04:15 GMT

మంచి కథ కథనంతో సినిమా వస్తే అందులో నటించింది ఎవరన్నది ఆడియన్స్ చూడరు. అందుకే టాలీవుడ్ లో ఇతర భాషల హీరోలకు మంచి క్రేజ్ ఉంటుంది. అదే తెలుగులో హీరోగా రాణించాలనుకుంటున్న వారికి స్పూర్తి ఇస్తుంది. ఆ స్పూర్తితోనే హీరోగా అవ్వాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు యువ హీరో ధర్మ. సింధూరం సినిమాతో తొలి ప్రయత్నం చేసి ఇప్పుడు డ్రింకర్ సాయిగా మలి సినిమాతో రాబోతున్నాడు.


ధర్మ లీడ్ రోల్ లో కిరణ్ తిరుమలశెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా డ్రింకర్ సాయి. ఈ సినిమాలో ధర్మ సరసన ఐశ్వర్య శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై బసవరాజు శ్రీనివస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా డ్రింకర్ సాయి సినిమా తెరకెక్కింది. ఈ నెల 27న రిలీజ్ అవుతున్న డ్రింకర్ సాయి గురించి హీరో ధర్మ మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలేంటో చూద్దాం.

ధర్మలో నటుడి అవ్వాలన్న కోరిక ఎలా మొదలైంది అన్న దానికి ఆయన ఏమన్నారు అంటే..

మాది గుంటూరులోని హనుమాన్ జంక్షన్. చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డ్యాన్స్ అంటే ఆసక్తి ఉండేది. చిరంజీవి గారి పాటలకు డ్యాన్స్ లు చేసేవాడిని. స్కూల్ లో ఉన్నప్పుడు నాటకాల్లో నటించాను. అలా క్రమంగా సినిమాల మీద ఇష్టం పెరిగింది. మా తాతగారు ఎగ్జిబిటర్. హనుమాన్ జంక్షన్ లో థియేటర్ ఉండేది. మా నాన్న కాకాణి బాబు సుహాసని, శోభన్ బాబు జంటగా పుణ్యదంపతులు సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా చేశారు. నాకు తెలిసిన అంకుల్ ఒకరు మీ నాన్న ప్రొడ్యూసర్ కదా నీతోనే సినిమా చేయమను అన్నారు. కానీ నాన్నకు నేను ఇండస్ట్రీలోకి వెళ్లడం ఇష్టం లేదు. మాకు కొన్ని థియేటర్స్ ఉన్నాయి. కొన్ని రోజులు ఆ థియేటర్స్ లో వర్క్ చేశా. రోజూ సినిమాలు చూస్తుండేవాడిని. నన్ను నేను తెరపై ఎప్పుడు చూసుకుందామా అని అనిపించేది. ఇంజినీరింగ్ చదివాక నేను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశా. లాభాలు చూశాను. ఆ తర్వాత సత్యానంద్ గారి ఇనిస్టిట్యూట్ లో చేరి యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాను. నా అభిమాన నటుడు ప్రభాస్. ఆయన నటన చూస్తే ఎంతో నాచురల్ గా ఉంటుంది. డ్యాన్సుల్లో చిరంజీవి గారి గ్రేస్ మరే హీరోకు రాదనేది నా అభిప్రాయమని అన్నారు ధర్మ.

మొదటి సినిమా గురించి ధర్మ ఎమన్నారంటే..

నేను సింధూరం అనే సినిమాలో నటించాను. నేను ఒప్పుకున్న ఫస్ట్ మూవీ డ్రింకర్ సాయినే. అయితే ఫస్ట్ రిలీజ్ అయ్యింది సింధూరం. ఇది నా రెండో మూవీ అయ్యింది. ఈ కథ విన్నప్పుడు ఎగ్జైట్ అయ్యాను. వాస్తవంగా ఒక వ్యక్తి జీవితంలో జరిగిన కథ ఇది. నేను వెళ్లి ఆ వ్యక్తిని కలిశాను. అతని లైఫ్ లో జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాను. అయితే మా మూవీలో వాస్తవ ఘటనలకు కొంత ఫిక్షన్ కలిపి రూపొందించాం.

డ్రింకర్ సాయి ఎలా మొదలైంది అన్న ప్రశ్నకు జవాబు ఇస్తూ..

డ్రింకర్ సాయి సినిమా 2019లో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ షూటింగ్ చేశాం. మొదట అనుకున్న కథకు లాక్ డౌన్ లో మరికొన్ని మార్పులు చేసి రూపొందించారు మా డైరెక్టర్ కిరణ్ గారు. ఆయన మారుతి గారి దగ్గర రైటర్ గా వర్క్ చేశారు. ఎంతో డెడికేషన్ తో ఈ సినిమాను రూపొందించారు. షూటింగ్ కంఫర్ట్ గా చేశాం.

డ్రింకర్ సాయి హీరోయిన్ గురించి ధర్మ చెబుతూ.. హీరోయిన్ ఐశ్వర్య శర్మ మంచి యాక్ట్రెస్. తను చాలా ఫోకస్డ్ గా నటించింది. చాలామంది తమ పని తప్ప మిగతా వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చుతుంటారు. ఐశ్వర్య మాత్రం ఎప్పుడూ మూవీ గురించే ప్యాషనేట్ గా వర్క్ చేసేది. బాగీ క్యారెక్టర్ లో తన పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఐశ్వర్యతో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది.

సినిమాలో తన పాత్ర గురించి హీరో చెబుతూ..

నేను సాయి అనే క్యారెక్టర్ చేసేందుకు చాలా మంది డ్రింకర్స్ ను అబ్సర్వ్ చేశాను. నాకు డ్రింకింగ్ అలవాటు లేదు. మా డైరెక్టర్ నన్ను కొన్ని బార్స్ కు తీసుకెళ్లి తాగిన తర్వాత వాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారో చూపించారు. అలా తాగేవారి బాడీ లాంగ్వేజ్ తెలిసింది.

టీజర్, ట్రైలర్ అలా ఎందుకు ఉందని వివరణ ఇస్తూ..

ప్రొడ్యూసర్ బసవరాజు శ్రీనివాస్ గారికి చిరంజీవి గారు మిత్రులు. ఆయన పీఆర్ పీ పార్టీలో జనరల్ సెక్రటరీగా వర్క్ చేశారు. అలా మా మూవీ కథ గురించి చిరంజీవి గారికి చెబితే బాగుంది ప్రొసీడ్ అన్నారు. అలా మా మూవీకి మెగాస్టార్ చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ దక్కాయి. డ్రింకర్ సాయి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి లవ్ స్టోరీ, మెసేజ్ కూడా ఉంటుంది. అయితే ఆడియెన్స్ ను థియేటర్స్ కు అట్రాక్ట్ చేయడం కోసం ట్రైలర్, టీజర్ లో యూత్ ఫుల్ కంటెంట్ చూపించాం.

నాన్నకి నమ్మకం ఎలా కుదిరింది అన్నది వివరిస్తున్న ధర్మ..

డ్రింకర్ సాయి సినిమా చూసి మా నాన్న అప్రిషియేట్ చేశారు. ఆయన ఫస్ట్ టైమ్ నన్ను మెచ్చుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి వద్దన్న నాన్న డ్రింకర్ సాయి సినిమా చూసి నువ్వు ఇక్కడ సక్సెస్ అవుతావు అంటూ ఆశీర్వదించారు. మా సినిమా యూత్ ను ఎవ్వరినీ చెడగొట్టేలా ఉండదు. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకుంటారు. సెకండాఫ్ నుంచి కథ మరో స్థాయికి వెళ్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి మీ హార్ట్ టచ్ చేస్తుంది.

యాక్టింగ్ కోర్స్ లో సత్యానంద్ గారు చెప్పిన దాని గురించి చెబుతూ ధర్మ ఏమన్నారంటే..

సత్యానంద్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నాక, నువ్వు హీరోగా మంచి పొజిషన్ కు వెళ్తావని దీవించారు. ఆయన నా గురించి ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అందులో చాలా మంచి మాటలు నా గురించి చెప్పారు. ఆయన చేసిన సపోర్ట్ మర్చిపోలేను. ప్రస్తుతం చాలా కథలు విన్నాను. త్వరలో కొత్త ప్రాజెక్ట్ వివరాలు తెలియజేస్తా అని చెప్పారు ధర్మ.

Tags:    

Similar News