బాత్రూం కూడా లేని గదిలో హీరోయిన్

Update: 2017-11-23 05:42 GMT
సామాన్యులు అయినా సరే.. ఇల్లు అంటే అన్ని వసతులు ఉండాలని అనుకుంటారు. ఆఖరికి అద్దె ఇంటికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండాలని కోరుకుంటారు. మరి దాదాపుగా స్టార్ స్టేటస్ ఉన్న ఓ హీరోయిన్ ఇల్లు అంటే ఓ రేంజ్ లో ఊహించుకోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఓ హీరోయిన్ మాత్రం కేవలం ఒక్క ఇంట్లోనే నివాసం ఉంటోందట. చివరకు ఆ గదికి బాత్రూం సౌకర్యం కూడా లేకపోవడం మరీ ఆశ్చర్యం కలిగించే విషయం.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అమలా పాల్. రవాణా శాఖ రికార్డుల ప్రకారం ఆమె నివాసం పాండిచ్చేరి లోని సెయింట్ థెరిసా స్ట్రీట్ లో ఉన్న హౌస్ నెం.6. ఇదే అడ్రస్ లో తను ఏడాదిగా ఉంటున్నానని ఆధారాలు చూపించి.. తన కారును రిజిస్ట్రేషన్ చేయించుకుంది ఈ భామ. ఇందుకోసం ఇన్సూరెన్స్ పాలసీ కూడా కట్టింది. ఓ లక్షకు ఇన్సూరెన్స్ తీసుకుని.. 860 రూపాయలు ప్రీమియం కట్టి.. ఈ అడ్రస్ ఇచ్చిందామె. సెలబ్రిటీలు పన్ను ఎగవేసేందుకు ఇలా పాండిచ్చేరిలో వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై.. ప్రస్తుతం విచారణ జరుగుతుండగా.. ఆ దర్యాప్తులోనే ఈ వివరాలు వెల్లడయ్యాయి.

అమలాపాల్ చెప్పిన ప్రకారం అయితే.. ఆ ఇంటిలోని టెర్రస్ పై ఉన్న గదిలో.. కనీసం బాత్రూం కూడా లేని గదిలో నివాసం ఉంటోందన్న మాట. ఈ మేరకు అధికారులు తేల్చారు. ఇక ఫహద్ ఫాజిల్ ఇచ్చిన అడ్రస్ ప్రకారం అయితే.. అతని నివాసం గురించి అక్కడెవరికీ తెలియదు. సురేష్ గోపీ ఇచ్చిన చిరునామాలో వేరే వ్యక్తి నివాసం ఉంటున్నాడని చెప్పారట చుట్టుపక్కల వారు.
Tags:    

Similar News