అమలా పాల్.. ఉంది అంటే ఉంది

Update: 2016-12-15 15:30 GMT
మొన్నటివరకు కొలీవుడ్ లో వచ్చిన కొన్ని రూమర్లు జనాలకు చాలా కలవరపెట్టేశాయి. దర్శకుడు ఏ.ఎల్.విజయ్ దగ్గర నుండి విడాకులు తీసుకుంటోంది అనే న్యూస్ రాగానే.. విజయ్ వాళ్ల నాన్న అళగప్పన్ ఇప్పుడు అమలకు ఆఫర్లు రాకుండా చేస్తున్నాడనే టాక్ కూడా ఉంది. అలాగే హీరో ధనుష్‌ కూడా రెండు సినిమాల నుండి ఈమెను తప్పించాడనే టాక్ ఉంది.

అయితే ఇవాళ జరగిన విఐపి 2 సినిమా ముహూర్త ఈవెంట్లో అందరికీ యాజూజువల్ మతిపోయింది మరి. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ మొదటి భాగంలో హీరోయిన్ గా నటించిన అమలా పాలే. అమ్మడు చక్కగా చీర కట్టుకొని.. స్లీవ్ లెస్ జాకెట్టులో మెరిసిపోయింది. అసలు విఐపి అనే హిట్టు సినిమాకు సీక్వెల్ చేస్తున్నప్పుడు.. అందులో అమలా పాల్ ను తీసుకోకుండా ఎలా ఉంటారు? పైగా ఎవరో ఒక తమిళ డైరక్టర్ తో పెళ్ళిచేసుకుని బ్రేకప్ అయినంత మాత్రాన.. ఆమెలోని నటి మాయమైపోతుందా? లేదంటే నటన తగ్గిపోతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. ఆమెతో చేయాలనుకున్న తమిళ సినిమాలన్నింటిలోనూ ఉంది అంటే ఉంది అంటున్నారు.

ఇకపోతే ఈ సినిమాలోనే కాదు.. ధనుష్‌ ఇప్పుడు పా.రంజిత్ (కబాలి ఫేం) డైరక్షన్లో రూపొందిస్తున్న సినిమాలో రజనీకాంత్ తో అమలా పాల్ రొమాన్స్ చేయనుందనే టాక్ వినిపిస్తోంది. చూస్తుంటే ఇతర పెద్ద స్టార్లు కూడా ఇప్పుడు ధనుష్‌ తరహాలో అమలా పాల్ కు రెడ్ కార్పెట్ వేసేలా ఉన్నారే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News