ప్రస్తుత కోవిడ్ కాలంలో మనిషికి శాంతి కరువైంది. ప్రశాంతత అనేది కనుమరుగై ఆ స్థానంలో ఒత్తిడి పెరుగుతోంది. ధ్యానం యోగా ప్రాణాయామం వంటి పూర్వీకుల మునీశ్వరుల విద్యల్ని అనుసరించి తిరిగి తమను తాము ప్రజలు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆరోగ్యకరమైన జీవనాన్ని అలవాటు చేసేందుకే కోవిడ్ ప్రబలుతోందనేది కొందరి పాజిటివిటీ విశ్లేషణ.
అదంతా సరే కానీ... ప్రస్తుత ఒత్తిళ్ల ను అధిగమించేందుకు ఏడాది కాలంగా అమలాపాల్ చేస్తున్నదేమిటో అందరూ చూస్తున్నదే. ఇటీవల పాల్ పూర్తిగా ప్రకృతి జీవనానికి అంకితమయ్యారు. ఆధ్యాత్మిక వనాల్లో సంచరిస్తున్నారు. అడవులు కొండలు కోనలు వాగులు దాటుకుంటూ వెళుతూ అక్కడి నుంచి లైవ్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ యోగాసనాలు వేస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు.
తాజాగా ఈ సిరీస్ లో మరో ఆసక్తికర ఫోటో బయటకు వెలువడింది. దానికి అమలాపాల్ ఆసక్తికర వ్యాఖ్యానాన్ని జోడించారు. ``ఇది మీకు పూర్తి శాంతిని ఇస్తుంది - అంటే.. మీరు నిజంగా మీకు కావలసినదాన్ని తదుపరి దశలో బహిర్గతం చేయగలుగుతారు. కానీ మీరు దేనితో శాంతి చేయకపోతే సాక్షాత్కారం అనుభూతి చెందలేరు`` అంటూ తనదైన ఆధ్యాత్మక భావనల్ని పాల్ ఆవిష్కరించారు. ఇక దేవత చెంత `దేవత అవతారం`లో ప్రత్యక్షమైన పాల్ అందరిలో స్ఫూర్తి నింపుతోంది. ప్రశాంత చిత్తంతో ప్రకృతి సిద్ధమైన తన జీవనం అందరినీ లోతుగా టచ్ చేస్తోంది. మెడలో ప్రకృతి సిద్ధమైన అలంకరణతో దేవతనే తలపిస్తోంది.
అమలా పాల్ కెరీర్ మ్యాటర్ కి వస్తే... ప్రస్తుతం వరుసగా ప్రయోగాత్మక కథాంశాల్లో నటిస్తున్నారు. ఇటీవలే లస్ట్ స్టోరీస్ రీమేక్ పిట్టకథలు లో అమలాపాల్ నటించారు. మలయాళంలో ఆడుజీవితం .. పరన్ను పరన్ను పరన్ను .. తమిళంలో అంధ పరవై పోలా ... కడవర్ అనే చిత్రాల్లో నటిస్తున్నారు.