నా బొడ్డుపై అంత డిస్కషన్ అవసరమా?

Update: 2017-11-27 09:50 GMT
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డస్కీ ఉంటూ యాక్టింగ్ తో ఇంప్రెస్ చేసే హీరోయిన్స్ లలో అమలాపాల్ ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఈ భామ గ్లామర్ డ్రెస్సుల్లో అంతగా కనిపించేది కాదు. వీలైనంత వరకు పక్కింటి అమ్మాయిలా చాలా న్యాచురల్ డ్రెస్సుల్లో కనిపించేది. ఇక సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తే చూడటానికి రెండు కళ్లు చాలవు. చీరలో అలాగే లంగా ఓనిలో అమ్మడి లుక్స్ చాలా ఇన్నోసెంట్ గా ఉండేవి.

కానీ టెక్నాలజీ లా హీరోయిన్స్ కూడా అప్డేట్ అయితేనే కెరీర్ ని సక్సెస్ ట్రాక్ లో తీసుకెళ్లవచ్చు అని అమలా గ్లామర్ ట్రాక్ లో నుంచి వెళుతోంది. కనిపించింది ట్రెడిషినల్ లుక్ లో అయినా సెక్సీగా కనిపించాలని తన స్టైల్ లో హాట్ గా దర్శనం ఇస్తోంది. అయితే రీసెంట్ గా అమ్మడు వ్యక్తిగత జీవితంలోను అలాగే సినీ జీవితంలోను కొన్ని విమర్శలను ఎదుర్కొంటోంది. ఇక త్వరలో రానున్న తమిళ్ మూవీ తిరుత్తుపయలే 2 పై కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఆ సినిమా తెలుగులో దొంగోడొచ్చాడు అనే టైటిల్ తో ఈ నెల 30న రిలీజ్ కాబోతోంది. అయితే సినిమా పోస్టర్ లో అమలాపాల్ నడుము అందాలు కొంచెం ఘాటుగా ఉన్నాయని.. నాభి అందాలు శృతిమించాయని విమర్శలు వచ్చాయి.

రిసేంట్ గా ఆ కామెంట్స్ పై అమ్మడు వివరణ ఇచ్చింది అమలా పాల్. లైఫ్ లో నా నడుంపై బొడ్డుపై ఇలాంటి కాంట్రోవర్సీ క్రియేట్ అవుతుందని నేను అనుకోలేదు. అయినా మనం 2017 లో జీవిస్తున్నాం. ఇప్పుడు కూడా ఇలాంటివి సెన్సేషన్ అవ్వడం ఏమిటో.. ఇక సినిమాలో నా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా బోల్డ్ గా కూడా ఉంటుంది. ఈ పాత్ర చేశాక నేను చాలా నేర్చుకున్నాను అని అమలా పాల్ వివరించింది
Tags:    

Similar News