కేరళ భామ అమలాపాల్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే సంపాదించుకుంది. అయితే పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకొని విఐపి-2తో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అమల.. ఇటీవల ఆమె సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇదిలా ఉండగా.. తాజాగా అమలాపాల్ ఒక తెలుగు వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు తెలుస్తుంది. అది కూడా అల్లు అరవింద్ సొంత ఓటిటి ఆహా కోసమేనట. ఈ మధ్య సినీ తారలంతా డిజిటల్ స్ట్రీమింగ్ వైపే దృష్టి పెడుతున్నారు. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా డిజిటిల్ వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే అల్లు అరవింద్ ఆహా ఓటిటి కోసం కొత్తగా సినిమాలు, ప్రోగ్రాంలతో పాటు వెబ్ సిరీస్ లను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు వాళ్ళతో పాటు పరబాషా నటులను కూడా ఆహా లోకి తీసుకొస్తున్నారు. తాజాగా ఆ లిస్టులోకి అమలాపాల్, కన్నడ డైరెక్టర్ పవన్ కుమార్ చేరారు. కన్నడలో హిట్ సినిమాలు తీసిన పవన్.. అమలాపాల్ తో 'కుడి ఎడమైతే' అనే వెబ్ సిరీస్ రూపొందించనున్నాడట. ప్రస్తుతం అదే వెబ్ సిరీస్ కోసం అమలాపాల్, పవన్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఆహా కోసం అల్లు ఫ్యామిలీ చిన్న నుండి పెద్ద స్టార్స్ వరకు అందరికి అవకాశాలు ఇస్తున్నారని సినీవర్గాలలో టాక్. ఇక ఇప్పటికే హిందీలో మహేష్ భట్, జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్లో అమలాపాల్ నటిస్తోంది. ఆల్రెడీ ఈ భామ అల్లు అర్జున్, రాంచరణ్ లతో సినిమాలు చేసేసింది. చూడాలి మరి ఆహాకి అమల ఎలా హెల్ప్ అవుతుందో..!