తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి పెద్ద కంపెనీలు సెలబ్రిటీలతో ప్రచారం చేయించడం మామూలే. కానీ ఆ సెలబ్రిటీలు చిన్న తప్పు చేసినా వాటి ఎఫెక్ట్ వాళ్లను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకున్న కంపెనీలపై పడుతోంది. ఆమధ్య అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో స్నాప్ డీల్ అతడితో కాంట్రాక్ట్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
తాజాగా బాలీవుడ్ క్యారెక్టర్ యాక్టర్ స్వరభాస్కర్ కు దాదాపుగా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఫేమస్ ఆన్ లైన్ పోర్టల్ కు స్వరభాస్కర్ ప్రచారం చేస్తుంటుంది. ఈమధ్య దేశంలో సంచలనం కలిగించిన కథువా - ఉన్నావ్ రేప్ లకు వ్యతిరేకంగా స్వరభాస్కర్ ఓ ఆన్ లైన్ క్యాంపెయిన్ చేసింది. ‘‘నేనో హిందూస్థానీని. కథువా దేవీ ఆలయంలో ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు’’ సిగ్గు పడుతున్నా అంటూ పోస్టర్ చేతిలో పట్టుకుని సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేసింది. దీనిని చాలామంది ఫాలో అయ్యారు.
అప్పటి నుంచి నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. తాజాగా స్వరభాస్కర్ ఓ మ్యూజిక్ సిస్టం కొనాలని ఉందంటూ చేసిన ట్వీట్ కు అమెజాన్ రిప్లయ్ ఇస్తూ రీట్వీట్ చేసింది. దాంతో నెటిజన్లంతా అమెజాన్ పై పడ్డారు. హిందువులను అవమానిస్తూ మాట్లాడిన స్వర భాస్కర్ ప్రమోట్ చేసినంతకాలం అమెజాన్ ను వాడమంటూ అన్ ఇన్ స్టాల్ చేయడం మొదలెట్టారు. ఏళ్ల తరబడి యాప్ వాడుతున్నవారు కూడా బై చెప్పేస్తూ డిలిట్ మెసేజిలు పంపుతున్నారు. దీంతో అమెజాన్ వెంటనే స్వరభాస్కర్ ట్వీట్ ను డిలిట్ చేసేసింది. కానీ నెటిజన్లు మాత్రం బాయ్ కాట్ అమెజాన్ పేరిట క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం స్వరభాస్కర్ చేసినదానిలో తప్పేం లేదని వెనకేసుకొస్తున్నారు.