స్టార్ హీరోల చిత్రాలకు ఓటీటీ రూపంలో కురుస్తోన్న కాసుల వర్షం గురించి చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ కి ముందే కార్పోరేట్ దిగ్గజ ఓటీటీలు కోట్లు గుమ్మరిస్తున్నాయి. సినిమా సెట్ లో ఉండగానే డీల్ క్లోజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓటీటీల మధ్య పోటీ కూడా తీవ్ర స్థాయిలోనే ఉంటుంది. ఈ పోటీ నిర్మాత జేబు నింపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా డిజిటల్ రూపంలో శాటిలైట్ అదనంగా కలిసొస్తుంది.
ఇటీవలి రిలీజ్ అయిన 'గాడ్ ఫాదర్'.. 'వాల్తేరు వీరయ్య' చిత్రాలను స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఒక్కో చిత్రాన్ని 50 కోట్లకు పైగా వెచ్చించి కోనుగోలు చేసింది. రెండు సినిమాల్ని ప్యాకేజీ కోటాలో నెట్ ప్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. గాడ్ ఫాదర్ థియేటక్రికల్ రిలీజ్ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో నెట్ ప్లిక్స్ లోనూ మంచి రేటింగ్ తో దూసుకుపోవండం ఖాయం.
మిగతా సంస్థలతో పోల్చితే నెట్ ప్లిక్స్ వేగం పెరిగిందిప్పుడు. ఇంతకాలం ప్లాప్ కంటెట్ తో నెమ్మదించిన నెట్ ప్లిక్స్ సక్సెస్ పుల్ కంటెంట్ తో గతం కంటే మెరుగ్గా కనినిస్తోంది. కంటెంట్ కొనుగోలు విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. ఈ నేపథ్యంలో
అమెజాన్ ప్రైమ్.. డిస్నీ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు సైతం రాబోయే రోజుల్లో పెట్టుబడులు పెంచే ప్లాన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా అమెజాన్ ప్రైమ్ బాలీవుడ్ చిత్రం 'జవాన్' కి ఏకంగా 100 కోట్లు ఆఫర్ చేసినట్లు బాలీవుడ్ మీడియా కథనాలు వెడెక్కిస్తున్నాయి. అయితే మేకర్స్ మాత్రం 150 కోట్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫిగర్ ఒకే అయితే డీల్ క్లోజ్ చేద్దాం అన్న సంకేతాలు అమెజాన్ కి నిర్మాణ సంస్థ పంపించినట్లు తెలుస్తోంది. హిందీ..తమిళ్ భాషల్లో భారీ స్పాన్ లో రిలీజ్ చేస్తోన్న చిత్రమిది.
రెండు భాషల్లోనూ షారుక్ క్రేజ్ ప్రత్యేకమైనది. అందుకే అమెజాన్ 100 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.ఇక సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. షారుక్ ఖాన్ మూడేళ్ల గ్యాప్ తర్వాత చేస్తోన్న చిత్రమిది. అంతకు మందు వరుసగా పరాజయాలు ఇబ్బంది పెట్టాయి. ఈనేపథ్యంలో ఎక్కువ సమయం తీసుకుని పక్కా హిట్ కంటెంట్ తో రావాలని కోలీవుడ్ యంగ్ మేకర్ అట్లీని రంగంలోకి దించారు.
యువ మేకర్ కి ఇంత వరకూ వైఫల్యమే లేదు. చేసిన చిత్రాలన్నీ బ్లాక్ బాస్లర్ అయ్యాయి. ఆ నమ్మకంతోనే అట్లీకి పిలిచి మరీ అవకాశం కల్పించాడు. తమిళ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని హీరోయిన్ గా నయనతారని తీసుకున్నారు. అలాగే షారుక్ ని ఢీ కొట్టే పాత్రకి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని విలన్ గా ఎంపి క చేసారు.
మరోవైపు తలపతి విజయ్ ప్రత్యేక అతిధి మరియు పాటలో కనిపించనున్నారు. ఇలా భారీ తారగణంతో జవాన్ తెరకెక్కుతోంది. అలాగే యువ సంగీత సంచలనం అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సినిమాలో ఇంత స్టప్ ఉంది కాబట్టే అమెజాన్ 100 కోట్లు ఆఫర్ చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.