అమెజాన్ షాకిచ్చిందా.. డబుల్ గేమా?

Update: 2020-01-15 06:11 GMT
సురేష్ బాబుకి ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గ‌జం అమోజాన్ షాక్ ఇచ్చిందా?  సురేష్ బాబు పెట్టిన కండీష‌న్ ని అమెజాన్ లైట్ తీసుకుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. వెంక‌టేష్‌-నాగచైత‌న్య క‌థానాయ‌కులుగా సురేష్ బాబు -పీపుల్స్ మీడియా విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించిన వెంకీ మామ డిసెంబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమా క‌మ‌ర్శియ‌ల్ గా మంచి వ‌సూళ్ల‌ను తెచ్చి పెట్టింది. రివ్యూలు డివైడ్ గా వ‌చ్చినా ఈ సినిమాకి రిలీజ్ టైమ్ ప‌ర్ఫెక్ట్ గా క‌లిసొచ్చింద‌న్న‌ది ఓ విశ్లేష‌ణ‌. దీంతో నిర్మాత స‌హా డిస్ట్రిబ్యూట‌ర్లు- ఎగ్జిబిట‌ర్లు- బ‌య్య‌ర్లు అంతా హ్యాపీ. అంచ‌నాని మించి వెంకీమా స‌క్సెస్ సాధించింది. నిర్మాత‌ల‌కు  డిజిట‌ల్ రైట్స్ రూపంలో భారీగానే లాభాలు వ‌చ్చాయి.

అయితే డిజిట‌ల్ వేదిక‌ల‌పై రిలీజ్ చేయాలంటే 50 రోజుల త‌ర్వాత రిలీజ్ చేయాల‌ని నిర్మాత సురేష్ బాబు కండీష‌న్ పెట్టారు. వాస్త‌వానికి 30 రోజుల త‌ర్వాత ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ చేసుకోవ‌చ్చు. కానీ సురేష్ బాబు రెక్వెస్ట్ తో  50 రోజులు కండీష‌న్ పెట్టారు. అందుకు ఆమెజాన్ నిర్వాహ‌కులు  కూడా అంగీక‌రించారు. ఎగ్జిబిట‌ర్ల‌ను దృష్టిలో పెట్టుకుని సురేష్ బాబు పెట్టిన  కండీష‌న్ ఇది. అయితే ఆమోజాన్ ఆ కండీష‌న్ గాలికి వ‌దిలేసింది.  సినిమా విడుద‌లై స‌రిగ్గా జ‌న‌వ‌రి 13వ తేదీకి  నెల రోజులు అయింది.

అయితే ఆమెజాన్ మాత్రం జ‌న‌వ‌రి 12 నుంచే ఈ సినిమాను స్ట్రీమింగు చేసి ప్రేక్ష‌కుల‌కు అందుబాటులో ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది. దీంతో సురేష్ బాబు సైతం షాక్ అయిన‌ట్లు తెలుస్తోంది. అయితే వెంకీమామ‌ని  ఇప్ప‌టికే అన్ని థియేట‌ర్ల నుంచి తొల‌గించారు. జ‌న‌వ‌రి 10 వ‌ర‌కూ ఆడించినా ఆ త‌ర్వాత మ‌హేష్ స‌రిలేరు.. బ‌న్నీ అల వైకుంఠ‌పురములో సినిమాలు రిలీజ్ అయ్యాయి కాబ‌ట్టి ఎలిమినేష‌న త‌ప్ప‌దు. సినిమా రిలీజ్ త‌ర్వాత ఆన్ లైన్ స్ట్రీమింగ్  50 రోజులు..100 రోజుల త‌ర్వాత చేయాల‌ని కోలీవుడ్ లో ఇప్ప‌టికే గ‌డ‌బిడ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లోనూ కొంత మంది నిర్మాత‌లు కోలీవుడ్ నిర్మాత‌ల‌కు బాస‌ట‌గా నిలిచారు. అయితే ఇదింకా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంది.  ఇక వెంకీ మామ విష‌యంలో సురేష్ బాబుకే అమెజాన్ షాకిచ్చిందా .. ?  లేక థియేట‌ర్ల‌లో ఆడ‌ని సినిమాకి అడ్డంకులెందుకు అనుకున్నారా... ఇందులో గేమ్ ఏమిటో బాబు గారే చెప్పాలేమో!


Tags:    

Similar News