సూపర్ స్టార్ మహేష్ మల్టీప్లెక్స్ బిజినెస్ లో ప్రవేశించడం జనాల్లో హాట్ టాపిక్. దీపం ఉండగానే నమ్రత- మహేష్ ఇల్లు చక్కదిద్దడంపై అభిమానులు సహా అందరిలో ఆసక్తికర చర్చ సాగింది. గచ్చిబౌళి లాంటి కాస్ట్ లీ ఏరియాలో ఏఎంబీ మాల్ పేరుతో వరల్డ్ క్లాస్ థియేటర్లను ప్రారంభించారు. ఈ మాల్ లో మహేష్ పెట్టుబడి ఎంత? అనే దానికంటే సూపర్ స్టార్ బ్రాండింగ్ చేస్తున్న థియేటర్ చైన్ గా పాపులారిటీ అసాధారణంగా పెరిగింది. ప్రస్తుతం ఐమ్యాక్స్ ని కొట్టే రిచెస్ట్ థియేటర్స్ ఏవైనా ఉన్నాయా..? అంటే నగరంలో ఏఎంబీ మాల్ పేరే చెబుతున్నారంతా.
ఈ థియేటర్ లో ఏడు స్క్రీన్లలో అన్ని సీట్లు ఫుల్స్ అవుతున్నాయని తెలిసింది. అయితే థియేటర్ ఇంద్ర భవనాన్ని తలపిస్తున్నా .. ఇందులోనూ కొన్ని సమస్యలున్నాయని విజిటర్స్ ఆరోపించడం ప్రస్తుతం చర్చకొచ్చింది. ఇదివరకూ ఏఎంబీ మాల్‌లోని రిక్లెయినర్ ఒకటి రిపెయిర్ లో ఉందని దానిని వెంటనే బాగు చేయాలని నమ్రతకు ట్వీట్ చేశాడు ఓ విజిటర్. అలాగే తాజాగా ఈ మాల్ లో పార్కింగ్ పెద్ద సమస్యగా ఉందని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు.
మాల్ అద్భుతంగా ఉంది. అయితే అన్ని మాల్స్ లానే ఇక్కడా పార్కింగ్ పరంగా చిక్కులున్నాయి. పార్కింగ్ విషయంలో ప్రణాళికా బద్ధంగా లేదని విమర్శిస్తున్నారు. వాస్తవానికి నగరంలో పార్కింగ్ అన్నదే అతి పెద్ద సమస్య. దానికి పరిష్కారం ఇవ్వలేని మాల్స్ ఫెయిలవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఏఎంబీ మాల్ కి ఆరంభ కష్టాలేనని భావిస్తే కనీసం ఇకనైనా ఆ సమస్యని సమర్థంగా పరిష్కరించాలని జనం కోరుతున్నారు. అలాగే అక్కడ సిబ్బంది విజిటర్స్ విషయంలో ఎంతో జాగరూకతగా వ్యవహరిస్తే ఏ చిక్కులు ఉండవు. సుశిక్షితులైన సిబ్బందితో ఏ సమస్యలు ఉండవని నివేదిస్తున్నారు. మరి నమ్రత మహేష్ దీనిని సుమోటోగా పరిశీలిస్తారేమో చూడాలి. మాల్ ప్రారంభమైనప్పటి నుంచి దాని బాగోగులన్నీ తనే దగ్గరుండి ప్రతిదీ చూసుకుంటున్నారు. సమస్యలపైనా వెంటనే స్పందించి సొల్యూషన్ ఇస్తారనే భావిద్దాం.