ఏజ్ క‌న‌బ‌డ‌కుండా దాచేస్తున్న 45 ప్ల‌స్ బ్యూటీ

Update: 2022-01-17 13:30 GMT
బాలీవుడ్ న‌టి అమీషా ప‌టేల్(46) కెరీర్ జ‌ర్నీ గురించి తెలిసిందే. సుమారు రెండు ద‌శాబ్ధాల పాటు న‌టిగా కెరీర్ బండిని లాగించేసింది. కానీ ఇటీవ‌ల బాలీవుడ్ లో ఏమంత ఆఫ‌ర్లు రావ‌డం లేదు. కానీ మాతృభాష‌లో అవ‌కాశాలు అందుకుంటోంది. దీంతో మ‌ళ్లీ న‌టిగా స్పీడ‌ప్ అవుతోంది. గ‌డిచిన ఆరేడేళ్ల‌లో అమీషా కెరీర్ కి ఎప్ప‌టిక‌ప్పుడు బ్రేకులు ప‌డ‌టం.. మ‌ళ్లీ ఏదో ఒక హిట్టు కొట్టి లైమ్ లైట్ లోకి రావ‌డం చూస్తున్న‌దే. గ‌త మూడేళ్లుగా పూర్తిగా సినిమాల‌కు దూర‌మైంది. కానీ ఈసారి మాత్రం ఏకంగా నాలుగైదు సినిమాలతో కొత్త ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డిన సినిమాలు త‌దుప‌రి ప‌నుల్ని ముగించుకుంటున్నాయి. `దేశీ మ్యాజిక్`..`టూబా తేరా జ్వాలా`..`ది గ్రేట్ ఇండియ‌న్ కాసినో` చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉండ‌గా..`మిస్ట‌రీ ఆఫ్ టాటూ`..`గ‌ద‌ర్ -2` చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి.

ఇవ‌న్నీ ఇదే ఏడాది రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది. 46 ఏళ్ల బ్యూటీ ఆశ‌ల‌న్నీ ఈ చిత్రాల‌పైనే ఉన్నాయి. కెరీర్ ఆరంభంలో ఇలా బ్యాక్ టూ బ్యా్ సినిమాలు చేసింది. ఆ త‌ర్వాత  గ్యాప్ తో రిలీజ్ అయ్యేవి. మ‌ళ్లీ ఇంత కాలానికి కెరీర్ ఊపందుకుంది. దీంతో బ్యూటీ సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండ‌టం మొద‌లు పెట్టింది. కొన్ని రోజులుగా బ్యూటీ అందాల‌తో ఇన్ స్టాన్ హీటెక్కిస్తోంది తాజాగా మ‌రోసారి టెంప్టింగ్ ఎలివేష‌న్ తో హీట్ పెంచుతోంది. బ్లూ టైట‌ప్ ఫిట్ జీను ద‌రించి..వైట్ కల‌ర్ బ్లౌజులో ఎద అందాల‌తో మంట‌లు రేపుతోంది. అయితే ఈ ఫోటోలో అమీసా వ‌య‌సు మీరిన‌ట్లు క‌నిపిస్తోంది.

ముఖ‌మంతా మేక‌ప్ అద్దినా హాఫ్ సెంచ‌రీకి చేరువ కావ‌డంతో అమీషాలో గ్లోనెస్ త‌గ్గింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అమీషా టాలీవుడ్ లో బ‌ద్రి సినిమాతో ప‌రిచ‌య‌మైంది. ఆ సినిమాతో హీరోయిన్ గా మంచి పేరొచ్చింది. కానీ  బాలీవుడ్ పై మ‌క్కువ‌తో అక్క‌డే ఎక్కువ సినిమాలు చేసి స్థిర‌ప‌డింది. `నాని`..`న‌ర‌సింహుడు`..`ప‌ర‌మ‌వీర చ‌క్ర‌`లాంటి సినిమాల్లోనూ అమీషా మెరిసింది. కానీ అవేవి అమీషా కి క‌లిసి రాలేదు.
Tags:    

Similar News