వెండితెర యువరాజ్ ఎవరు.. కొత్త డౌట్లు రేపుతున్న ఆ ఫోటో..!

అలాంటి క్రికెటర్ జీవిత చరిత్రలో తెరకెక్కించే సినిమాలో సిద్ధాంత్+ నటించాలని అనుకుంటున్నాడు. ఆల్రెడీ యువరాజ్ సింగ్ బయోపిక్ ప్రాజెక్ట్ ను టీ సీరీస్ అనౌన్స్ చేసింది.

Update: 2024-12-25 02:30 GMT

బాలీవుడ్ లో యువ హీరో సిద్ధాంత్ చతుర్వేది ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నాడు. గల్లీ బాయ్ తో కెరీర్ మొదలు పెట్టిన అతను ఫోన్ బూత్, యుద్రా సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం దఢక్ 2 తో పాటు మరో సినిమా కూడా చేస్తున్న సిద్ధాంత్ ఈమధ్య ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేయగా అందులో మీ డ్రీమ్ రోల్.. ఛాలెంజ్ విసిరే ఎలాంటి రోల్ కోసం ఎదురుచూస్తున్నారు అన్న ప్రశ్న ఎదురైంది. దానికి సిద్ధాంత్ పరుగుల వీరుడు యువరాజ్ సింగ్ ఫోటోని ఆన్సర్ గా పెట్టాడు.

అక్కడ నుంచి అసలు మ్యాటర్ మొదలైంది. ఇప్పటికే బాలీవుడ్ లో యువరాజ్ సింగ్ బయోపిక్ గురించి ఎన్నో డిస్కషన్స్ జరుగుతున్నాయి. క్రికెట్ చరిత్రలో ఎన్నో సంచలన రికార్డులతో ప్రపంచ క్రికెట్ లోనే తనకంటూ కొన్ని పేజీలు ఉంచుకున్నాడు యువరాజ్ సింగ్. క్రీజ్ లో యువి ఉన్నాడు అంటే ప్రత్యర్ధులకు చుక్కలు అనేట్టుగా తన బ్యాట్ తో భయపెట్టాడు. ఇక యువరాజ్ సింగ్ ని ఛాలెంజ్ చేస్తే మాత్రం ఆరు బాళ్లకు ఆరు సిక్సులు పడినట్టే. ఆట కేవలం గెలుపు ఓటములు కాదు దేశ పరువుకి సంబంధించిందని ఆడే ప్రతి ఆటలో తన బెస్ట్ ఇచ్చేందుకు కృషి చేశాడు యువరాజ్ సింగ్.

అలాంటి క్రికెటర్ జీవిత చరిత్రలో తెరకెక్కించే సినిమాలో సిద్ధాంత్+ నటించాలని అనుకుంటున్నాడు. ఆల్రెడీ యువరాజ్ సింగ్ బయోపిక్ ప్రాజెక్ట్ ను టీ సీరీస్ అనౌన్స్ చేసింది. ఐతే ఎప్పుడో ఆగష్టులోనే ఈ సినిమా ప్రకటన రాగా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ముఖ్యంగా యువరాజ్ సింగ్ పాత్రలో ఎవరు నటిస్తారు అన్నది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. యువి రోల్ లో ఎవరు నటిస్తారని అటు క్రీడా అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఐతే సిద్ధాంత్ లేటెస్ట్ గా ఫ్యాన్స్ లో తన ఇష్టాన్ని చెప్పాడా లేదా యువి బయోపిక్ లో తను నటిస్తున్నాడని కన్ఫర్మ్ చేశాడా అన్నది తెలియట్లేదు.

ఒకవేళ సిద్ధాంత్ ఈ ప్రాజెక్ట్ చేస్తే మాత్రం అతని కెరీర్ కు చాలా ప్లస్ అయ్యే సినిమా అవుతుంది. ఇప్పుడు కాదు నాలుగేళ్ల క్రితం కూడా యువినే స్వయంగా తన బయోపిక్ కి సిద్ధాంత్ పేరు రిఫర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే సిద్ధాంత్ చతుర్వేదినే యువి బయోపిక్ కి తీసుకుంటారని అనిపిస్తుంది. మరి మేకర్స్ ఏం నిర్ణయిస్తారన్నది చూడాలి.

Tags:    

Similar News