బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్- కిరణరావు దంపతులు ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే భార్యా భర్తుగా విడిపోయినా స్నేహితుల్లా అప్పుడప్పుడు కలుస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎవరి దారులు వాళ్లవైనా జీవితంలో కలిసి చేసే కార్యక్రమాలు మాత్రం కొన్నుంటాయి. వాటి కోసం కలవక తప్పదు. ఈ జంటకు 9 ఏళ్ల బాలుడు అజాద్ కలడు. ఈ నేపథ్యంలో విడాకుల తీసుకున్న తర్వాత మొదటిసారి కలుసుకున్నారు. సెప్టెంబర్ 26న అమీర్-కిరణరావ్- అజాద్ లంచ్ కోసం బయటకి వెళ్లారు. భారీ భద్రత మధ్య ఈ లంచ్ పార్టీ జరిగింది. అనంతరం ఎంతో ఓపికగా ఫోటో సెషన్ లో పాల్గొన్నారు.
ఈ ఫోటోలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. విడిపోయినా చూడముచ్చట జంట అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక వీరిద్దరి వ్యక్తిగత జీవితంలో విడిపోయినా ప్రోఫెషనల్ గా మాత్రం కలిసి పనిచేస్తున్నారు. అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం కోసం ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా లడ్డాఖ్ లో అక్కడ స్థానికులతో ఇద్దరు కలిసి డాన్సులు చేసారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే విడాకులు తీసుకున్న కొన్ని విషయాల్లో కలిసి నడవాలని అగ్రిమెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ప్రకారమే కుమారుడు కోసం ఇటీవల కలిసినట్లు తెలుస్తోంది.
ఇటీవలే అమీర్ ఖాన్ నాగచైతన్య కథానాయకుడిగా నటించిన లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో అభిమానుల్ని పలకరించారు. వాస్తవానికి చై పిలవనప్పటికీ అమీర్ తెలుగు ఆడియన్స్ పై అభిమానంతో తో..అక్కినేని ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో ఎవరికీ చెప్పకుండానే వచ్చేసారు. అప్పటి నుంచి అమీర్ పై తెలుగు ప్రేక్షకుల అభిమానం రెట్టింపు అయింది. నాగచైతన్య లాల్ సింగ్ చద్దాలో ఓ కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. చైకిది బాలీవుడ్ లో తొలి చిత్రం కావడం విశేషం.