బిగ్ బీ ఖాతాలో మ‌రో ఇల్లు..మ‌న‌వ‌ల కోస‌మేనా ఆరాటం?

Update: 2022-09-21 12:52 GMT
బిగ్ బీ  అమితాబ్ బచ్చన్ భారీగా ఆస్తులు కూడ‌బెడుతోన్న సంగ‌తి తెలిసిందే. సంపాద‌నంతా వివిధ రంగాల్లో పెట్టుబ‌మ‌డులుగా పెడుతున్నారు. ఇదే క్ర‌మంలో సెక్యూర్ గా  భారీ భ‌వంతుల్ని సైతం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ముంబయిలో అయిదు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి. వాటిలో ఒదాంట్లో  అమితాబ్ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. మరో దాంట్లో ఆఫీస్ కార్యక‌లాపాలు  నిర్వ‌హిస్తున్నారు.

మరోటి గెస్ట్ హౌస్‌ గా వినియోగిస్తున్నారు. మిగిలిన రెండు భవనాలను  లీజుకు ఇచ్చారు. లీజ్ ద్వారా కోట్ల రూపాయ‌ల ఆదాయం స‌మ‌కూరుతుంది.  ఆమ‌ధ్య‌  31 కోట్ల రూపాయలు ఖర్చు చేసి  ముంబయిలో డ్యూప్లెక్స్ అపార్ట్‌ మెంట్  సైతం కొనుగోలు చేసారు.

ముంబయికి చెందిన టైర్‌ 2 బిల్డర్ క్రిస్టల్‌ గ్రూపుకు చెందిన అట్లాంటిస్ ప్రాజెక్ట్‌ లో బాలీవుడ్‌ కు చెందిన పలువురు అపార్ట్‌ మెంట్‌ లను కొనుగోలు చేయడం జరిగింది.  అదే గ్రూపులో  అమితాబచ్చన్  డ్యూప్లెక్స్‌ ను 31 కోట్లకు కొనుగోలు  చేసారు.

తాజాగా బిగ్ బీ  అంధేరిలోని ఫోర్ బంగ్లాస్‌లోని సొగసైన పార్థినాన్ అపార్ట్‌మెంట్‌లోని  31వ అంతస్తును కొనుగోలు చేసారు. శివారు ప్రాంతాలోని అత్యంత సున్నితమైన నివాస సముదాయాలలో ఒకటిగా  12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొంది. దీంతో అమితాబ్ ఖాతాలో మ‌రో అపార్ట్ మెంట్ కొత్త‌గా చేరింది.

ప్ర‌స్తుతం బిగ్ బీ కుటుంబం జుహులో  సొంత విశాలమైన భవనంలో నివసిస్తున్నారు. కొత్త‌గా భ‌వంతి కొన్న నేప‌థ్యంలో కుటుంబంతో అక్క‌డికి  షిప్ట్ అవుతున్నారా? అన్న సందేహం నేప‌థ్యంలో అలాంటి ఆలోచ‌న లేద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఆయ‌న పెట్టుబ‌డి అంతా కేవ‌లం మ‌న‌వ‌లు కోస‌మేన‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

న‌గ‌దు రూపంలో నిల్వ‌క‌న్నా రియ‌ల్ ఎస్టేట్ పెట్టుబ‌డులు ఎక్కువ లాభాలు తీసుకురావ‌డానికి అవ‌కాశం ఉంది. దీనిలో భాగంగానే అమితాబ్ ఆదాయాన్ని అపార్ట్ మెంట్ ల‌పై పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. వీటి ద్వారా  స్థిర‌మైన ఆదాయంతో పాటు సెక్యూర్ ఇన్క‌మ్   ఉంటుంది. అలా అమితాబ్ మ‌న‌వ‌ల కోసం ఆస్తులు కూడ‌గ‌డుతున్నారు.

ఓవైపు సినిమాలు చేస్తూ భారీగా పారితోషికం తీసుకుంటున్నారు. మ‌రోవైపు క‌మర్శియ‌ల్ యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాద‌నే. వాటి ద్వారా వ‌చ్చిన ఆదాయ‌న్ని ఇలా ఇన్విస్ట్ చేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ఇత‌ర భాష‌ల చిత్రాల్లోనూ బిగ్ బీ గెస్ట్ అప్పీరియ‌న్స్ ఇస్తూ భారీగా  ఛార్జ్ చేస్తున్న సంగ‌తి  తెలిసిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News