మెగాస్టార్‌ పేరును తప్పుగా వాడారట

Update: 2016-04-05 19:30 GMT
మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. ఆయన చాలా హానెస్ట్‌ మనిషి అని ఇండియా అంతా నమ్ముతుంది. అందుకే చాలామంది పెద్ద పెద్ద రాజకీయవేత్తలూ.. పెద్ద పెద్ద హీరోలూ.. అందరూ కూడా అమితాబ్‌ ఫ్యాన్స్‌ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతారు.

అయితే సడన్‌ గా 'పనామా పేపర్స్‌' పేరుతో అమితాబ్‌ కు బ్రిటీష్‌ వర్జిన్‌ ఐల్యాండ్స్‌ లో కొన్ని ఆఫ్‌-షోర్‌ సూట్‌ కేస్‌ కంపెనీల్లో వాటా ఉందని.. పలు కంపెనీల్లో ఆయన డైరక్టర్ గా కొనసాగుతున్నారని.. అక్కడ వేల కోట్ల రూపాయలను అక్రమంగా ఉంచారని ఆరోపణలు రావడంతో అందరూ షాక్‌ తిన్నారు. కాని ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే అమితాబ్‌ నోరు విప్పాల్సిందే.

''అబ్బే.. నా పేరును తప్పుగా ప్రస్తావిస్తున్నారు. నాకూ ఆ రిపోర్టుల్లో పేర్కొన్న కంపెనీలకూ ఎటువంటి కనెక్షనూ లేదు. ఓవర్‌ సీస్‌ లో నేను ఖర్చుపెట్టిన ప్రతీ పైసాకూ ట్యాక్సు కట్టాను. అంతే కాదు.. ఇండియాలో ట్యాక్సులన్నీ సరిగ్గా కట్టిన తరువాతే ఏదైనా డబ్బును ఫారిన్‌ పంపడం జరిగింది. ఒకవేళ నా పేరు ఎక్కడన్న ఉన్నా.. నేను తప్పు చేసినట్లు ఆ రిపోర్టుల్లో లేదుగా'' అంటూ సెలవిచ్చారు మెగాస్టార్‌ అమితాబ్‌.

చూస్తుంటే.. ఆఫ్‌ షోర్‌ కంపెనీల విషయం వన్‌ డే వండర్‌ లా మారిపోయేలా ఉంది.

Tags:    

Similar News