శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు - దివంగత నేత బాల్ ఠాక్రే జీవిత చరిత్ర ఆధారంగా `ఠాక్రే` బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బాల్ ఠాక్రే పాత్రలో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తున్నాడు. 'ఠాక్రే` చిత్ర ఫస్ట్ టీజర్ ను నిన్న ముంబైలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ - ఉద్ధవ్ ఠాక్రే చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా బాల్ ఠాక్రేతో తనకున్న అనుబంధాన్ని బిగ్ బీ గుర్తు చేసుకున్నారు. `కూలీ`షూటింగ్ సమయంలో తనకు ప్రమాదం జరినపుడు శివసేన అంబులెన్స్ సమయానికి వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడిందని బిగ్ బీ చెప్పారు. బాగా వర్షం పడుతోండడంతో అంబులెన్స్ లు దొరకని పరిస్థితిలో శివసేన అంబులెన్స్ తనను ఆస్పత్రికి తీసుకెళ్లిందని అమితాబ్ అన్నారు.
ఠాక్రే కుటుంబం కూడా తన సొంత కుటుంబం వంటిదని - బోఫోర్స్ ఆరోపణల సమయంలో కూడా తన తనకు ఠాక్రే అండగా ఉన్నారని బిగ్ బీ చెప్పారు. చివరి ఘడియల్లో ఠాక్రేను చూసేందుకు ఉద్దవ్ అనుమతించారని - ఆ పరిస్థితుల్లో ఆయనను చూడలేకపోయానంటూ అమితాబ్ ఎమోషనల్ అయ్యారు. `ఠాక్రే` పాత్రలో నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్న ఈ చిత్రానికి శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ సమర్పిస్తుండగా, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన పార్టీ జనరల్ సెక్రటరీ అభిజిత్ పన్సే దర్శకత్వం వహించనున్నారు. బాల్ థాకరేతో తనకు సుదీర్ఘ అనుబంధముందని, తనకు తెలిసిన విషయాలను ప్రజలకు తెలియజేస్తానని చెప్పారు. బాల్ థాకరే కుటుంబ సభ్యులతోపాటు వేరెవరి జోక్యం లేకుండా వాస్తవాల ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు.