బాలీవుడ్ మెగా స్టార్ అమితా బచ్చన్ దాదాపుగా ఎనిమిది పదుల వయసు దగ్గర పడ్డా కూడా ఇంకా హుషారుగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. సంవత్సరంలో ఒకటి రెండు సినిమాలు చేస్తూనే వస్తున్న అమితా బచ్చన్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. ఏదైనా వేడుకలకు మరియు కుటుంబ కార్యక్రమాలకు మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం పాల్గొనడం మనం చూస్తూనే ఉంటాం. జయా బచ్చన్ ను అమితాబ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అప్పట్లో వీరిద్దరి జంటకు హిట్ పెయిర్ గా పేరు దక్కింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్ స్టార్స్ లో వీరు ప్రముఖంగా ఉంటారు. బాలీవుడ్ స్టార్ కపుల్స్ కు వీరిద్దరు ఆదర్శం. తాజాగా అమితా బచ్చన్ తన వెడ్డింగ్ యానివర్శరీ సందర్బంగా పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. జయా బచ్చన్ తో తన పెళ్లి జరిగిన సందర్బంను వెళ్లడించి అందరిని ఆశ్చర్య పర్చాడు.
'జంజీర్' చిత్రం సూపర్ హిట్ అయితే స్నేహితులందరిని ఫారిన్ టూర్ కు తీసుకు వెళ్తానంటూ హామీ ఇచ్చాడట. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇచ్చిన మాట ప్రకారం స్నేహితులందరిని కూడా ఫారిన్ ట్రిప్ కు తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ స్నేహితుల్లో జయా బచ్చన్ కూడా ఉంది. అయితే అమితాబచ్చన్ తండ్రి హరివంశరాయ్ ఒప్పుకోలేదు. పెళ్లి కాకుండా జయాను ఫారిన్ టూర్ కు తీసుకు వెళ్లడానికి వీల్లేదని చెప్పాడట. దాంతో అప్పటికే ప్రేమలో ఉన్న అమితాబచ్చన్ మరియు జయాబచ్చన్ లు వివాహం చేసుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ జీ చెప్పుకొచ్చాడు. హడావుడిగా పెళ్లి చేసుకుని స్నేహితులతో పాటు ఫారిన్ టూర్ కు అబితాబ్ సతీసమేతగా వెళ్లాడు.