నటి రేఖ నుదిటిన బొట్టుకు ఆయనే కారణమట!

Update: 2020-04-25 09:10 GMT
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ రేఖ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా బిగ్ బి అమితాబ్ తో ప్రేమాయణం నడిపారని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే అమితాబ్ కి హీరోయిన్ జయబాధురితో పెళ్లి.. రేఖతో బ్రేకప్. అయితే రేఖ భర్త చనిపోయినా నుదిటిన సింధూరం పెట్టుకుంటారు. ఆమె సింధూరం ఎందుకు పెట్టుకుంటుందో.. పునీత్ ఇస్సార్ భార్య వివరించింది. 'నా భర్త పునీత్ ఇస్సార్ అంటే రేఖకు చాలా కోపం. కూలీ షూటింగ్‌లో అమితాబ్ ప్రమాదానికి గురయ్యారు. దానికి కారణం నా భర్త పునీత్ ఇస్సార్ అని రేఖ కోపంగా ఉంటుంది. చాలాసార్లు ఎదురుపడినా ఒక్కసారి కూడా మాట్లాడలేదు.

బిగ్ బి ఆక్సిడెంట్ తర్వాత పునీత్ ఇస్సార్ అంటే చాలా మందికి నచ్చలేదు. కొన్నేళ్ల పాటు ఒక్క ఆఫర్ కూడా ఇవ్వలేదు. కెరీర్ ముగిసిందనుకొనే టైంలో మహాభారత్‌లో ధుర్యోధనుడి పాత్ర లభించింది" అని పునీత్ ఇస్సార్ భార్య చెప్పారు. రేఖ గురించి మాట్లాడుతూ.. రేఖ భర్త చనిపోయినా ఇంకా ముత్తైదువగా ఉండటానికి కారణం అమితాబ్ అంట. బిగ్ బి బతికారనే కారణంగా రేఖ నుదుటన సింధూరం పెట్టుకొంటారట. బిగ్‌బీ అంటే ఇప్పటికి రేఖకు ప్రేమ ఉందని ఆమె చెప్పుకొచ్చింది. అమితాబ్ గాయం నుంచి కోలుకొన్న తర్వాత పునీత్ ఇస్సార్‌ను ఓ సందర్బంలో కలిశారు. పునీత్ ఇస్సార్ తప్పులేదని స్వయంగా బిగ్ బి చెప్పడంతో కొంత ఊరట దొరికిందట. కానీ ఇప్పటికి రేఖ ఓ హీరోయిన్ గా, మహిళగా బాలీవుడ్ హీరోయిన్స్ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.
Tags:    

Similar News