బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ 77 ఏళ్ల వయసులో కూడా ఇంకా యాక్టివ్ గా సినిమాల్లో నటిస్తున్నాడు. ఈయన నటించిన పలు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఈ వయసులో కూడా బిగ్ బి ప్రధాన పాత్రల్లో నటించడం యాక్షన్ సీన్స్ కూడా చేయడం అందరిని ఆశ్చర్యపర్చుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు.. ఆహారం.. వాతావరణంతో ఏడు పదుల వయసు వచ్చేప్పటికి కొందరు నిలబడే పరిస్థితి కూడా లేకుండా ఉంది. కాని అమితాబచ్చన్ మాత్రం ఎనిమిది పదుల వయసు దగ్గరకు వస్తున్నా కూడా ఇంకా యాక్టివ్ గా ఉండటంతో పాటు ప్రస్తుతం బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
తన బరువు 91 కేజీలు అంటూ బిగ్ బి చెప్పకనే తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా చెప్పాడు. అమితాబచ్చన్ తాజా తన పోస్ట్ లో 91 కేజీల బరువును మోయడం కష్టంగా ఉందని తగ్గాలనుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. అందుకోసం కసరత్తులు చేస్తున్న ఫొటోను కూడా షేర్ చేశాడు. యంగర్ జెనరేషన్ వాళ్లు జిమ్ లో చాలా కష్టపడుతున్నారు. వారు సినిమాల కోసం పడే కష్టం అభినందనీయం. కొందరు కుర్రాళ్లు కూడా ముసలి వాళ్ల మాదిరిగా మారిపోతున్నారు. కారణం వర్కౌట్స్ చేయక పోవడమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అమితాబ్ ఈ వయస్సులో బరువు తగ్గాలని భావించడం నిజంగా ఆయన పట్టుదలకు హ్యాట్సాప్. ఈ వయస్సులో జిమ్ చేయడమే గగనంగా భావిస్తుంటారు. అలాంటిది మెగాస్టార్ బరువు తగ్గుతానంటూ నమ్మకంగా ఉండటం ఆయన పట్టుదలకు నిదర్శనం. అలాంటి పట్టుదల ఉన్న కారణంగానే బాలీవుడ్ లో మెగాస్టార్ అయ్యాడంటూ ఆయన అభిమానులు అంటున్నారు.