శతాధిక చిత్రాల హీరో అయినా ఇప్పటికీ చాక్లెట్ బోయ్ లానే కనిపిస్తాడు హీరో శ్రీకాంత్. అతడి ఆహార్యంలో వయసు కనిపించదు. యంగ్ బోయ్ లా గ్లామర్ మెయింటెయిన్ చేస్తాడు. అయితే ఇటీవలి కాలంలో శ్రీకాంత్ ఎంచుకుంటున్న కాన్సెప్టులు ఏవీ వర్కవుటవ్వడం లేదు. అతడు వరుసగా ఫ్లాప్ లు ఎదుర్కోవాల్సి వస్తోంది. మెగా ఫ్యామిలీ హీరోలతో కలిసి నటించే ఛాన్స్ ఉన్నా అతడికి ఆశించినన్ని పాత్రలు మెగా సినిమాల్లో అడపాదడపా మంచి క్యారెక్టర్లు పడుతున్నా అతడి కెరీర్ కి మాత్రం ఆశించినంత బూస్ట్ దొరకడం లేదు. సోలోగా నటించే సినిమాలకు గిరాకీ తగ్గిపోయింది. తనతో పాటే కెరీర్ సాగించిన జగపతిబాబు విలక్షణమైన పాత్రల్ని ఎంచుకుంటూ తెలుగు, తమిళ్ పరిశ్రమల్లో దూసుకుపోతున్నాడు. శ్రీకాంత్ మాత్రం ఇప్పటికీ మూసలోనే కొట్టుకుపోతున్నాడు.
తనవైపు వచ్చిన కథలు ఏవైనా వెంటనే ఓకే చేసేసి హీరోగానే కంటిన్యూ అవుతున్నాడు. సంథింగ్ ఏదైనా కొత్తగా ట్రై చేయాలి. కొలీగ్ జగపతిలా దూసుకుపోవాలి .. అన్న ఆలోచనే చేయడం లేదు. ఏదైతేనేం మొత్తానికి తన బిడ్డల్ని సినిమా రంగంలోకే తీసుకొస్తున్నాడు. ఇప్పటికే తనయుడు రోషన్ హీరోగా ఆరంగేట్రం చేస్తున్నాడు. నాగార్జున లాంటి స్టార్ హీరో కం నిర్మాత చేతిలో పెట్టాడు కాబట్టి లాంచింగ్ అదిరిపోతుందనే భావిద్దాం. అయితే శ్రీకాంత్ కెరీర్ మాటేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం కళ్ల ముందే ఉంది. సినీ పరిశ్రమలో హీరోయిజానికి అంతం లేదు. పండు ముసలి అయ్యాక కూడా హీరోగానే కొనసాగొచ్చు. అయితే గట్స్ ఉండాలి. ఎంచుకునే కాన్సెప్టుల్లో వైవిధ్యం చూడాలి. ఈ విషయంలో శ్రీకాంత్ రేసులో వెనకబడ్డాడడనే అభిమానులు భావిస్తున్నారు. అతడిలో ఉన్న ఛార్మ్ కి, ఎనర్జీకి తగ్గ పాత్రలు ఇప్పట్లో రావడం లేదు.
ఇప్పటికైతే బన్ని హీరోగా బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తున్నాడు. అలాగే అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ ట్రై చేస్తున్నాడు. థ్రిల్లర్ లు కూడా తెలుగు తెరకి కొత్తేమీ కాదు. రాజశేఖర్ చెప్పే కథలో ఏం కొత్త ఉందో పదే పదే తరచి చూడాలి. లేదంటే శ్రీకాంత్ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లోనే కొట్టుకుపోతాడు. తెలివైన అడుగులు వేయాలి. మునుముందు ఇంకా మంచి సినిమాల్లో నటించాలని కోరుకుందాం.