టాలీవుడ్ లో యువ హీరో నితిన్ కి మంచి పేరుంది. ఇండస్ట్రీలో 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న యూత్ స్టార్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి చాలానే కష్టపడ్డాడు. ఇక నితిన్ ఎలాంటి వివాదాలు లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తారని అందరూ చెబుతుంటారు. అలాంటి నితిన్ పై ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ కమ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఒకటీ రెండు సినిమాలకు కలిసి పని చేసినప్పుడు సాధారణంగానే నటీనటులకు సాంకేతిక బృందానికి మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సత్సంబంధాలు కొనసాగిస్తేనే అవకాశాలు కూడా వస్తుంటాయి కాబట్టి.. అందరూ అలానే మెలుగుతుంటారు. కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన అమ్మ రాజశేఖర్ కు కూడా నితిన్ తో మంచి అనుబంధం ఉంది. అందుకే ఇద్దరూ కలిసి ''టక్కరి'' అనే సినిమా చేశారు.
సినిమా ప్లాప్ అయినా నితిన్ తో రాజశేఖర్ కు మంచి రాపోనే కొనసాగింది. అయితే అంత క్లోజ్ గా ఉండే నితిన్.. తన సినిమా ఫంక్షన్ కు వస్తానని చెప్పి రాలేదంటూ స్టేజ్ పైనే అమ్మ రాజశేఖర్ మండిపడ్డారు. నితిన్ కి అసలు డాన్సే రాదని.. వాడికి డాన్స్ నేర్పించింది తానేనని షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఓ గురువుగా నితిన్ తనకి రెస్పెక్ట్ ఇస్తాడని భావించామని.. కానీ అతనికి కృతజ్ఞతాభావం లేదనే తీవ్ర స్థాయిలో మాట్లాడారు.
మనం ఏ స్థాయిలో ఉన్నా అమ్మని గురువును మర్చిపోకూడదు. వారిని మర్చిపోయిన వాళ్ళు సూపర్ స్టార్స్ అవ్వరు అంటూ ఒక రకంగా శాపనార్థాలు కూడా పెట్టాడు. పది రోజుల ముందే ఈ సినిమా ఫంక్షన్ కు రమ్మని నితిన్ ని అడిగితే.. వస్తానని చెప్తే నమ్మాను. నితిన్ నాకు చాలా చాలా క్లోజ్. అందరూ వచ్చారు కానీ నాకు కావాల్సిన ఆ వ్యక్తి రాలేదు అని రాజశేఖర్ అన్నారు.
నితిన్ రాకపోవడానికి కూడా పెద్దగా కారణాల్లేవు. తనకు షూటింగ్ కూడా లేదు.. ఇంట్లోనే ఉన్నాడు. ఫీవర్ అని చెప్పాడు. కనీసం ఒక వీడియో బైట్ అయినా అవ్వమని అడిగాను. కానీ ఇవ్వలేదు అని తెలిపాడు. నేను చాలా అప్సెట్ అయ్యాను.. లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఇంతలా ఫీల్ అవుతున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు.
తన ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత నితిన్ రాకపోవడంతో అమ్మ రాజశేఖర్ అప్ సెట్ అయ్యుండొచ్చు. కానీ తనతో అంత క్లోజ్ గా ఉండే వ్యక్తి జ్వరంతో బాధపడుతూ సినిమా ఫంక్షన్ కు రాలేదనే విషయాన్ని ఆయన ఎందుకు ఆలోచించడం లేదని నితిన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేసిన 'టక్కరి' సినిమా చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది. అప్పటికే ప్లాప్స్ లో ఉన్న నితిన్ ను మరింత కిందికి తీసుకెళ్లింది. అయినప్పటికీ డైరెక్టర్ తో సాన్నిహిత్యాన్ని కొనసాగించాడు. కానీ రాజశేఖర్ మాత్రం నితిన్ కి లైఫ్ ఇచ్చింది తానేనంటూ మాట్లాడటం తప్పు అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
అలానే వేదికపై నితిన్ ను 'వాడు' 'వీడు' అని సంభోదించడం కూడా కరెక్ట్ కాదని అంటున్నారు. అయితే తమిళులు తెలుగు మాట్లాడినప్పుడు అలాంటి పదాలు వస్తుంటాయి కాబట్టి.. నితిన్ ను అగౌరపరచాలనే అమ్మ రాజశేఖర్ అలాంటి కామెంట్స్ చేసారని అనుకోలేం. ఏదేమైనా ఆరోగ్యం బాగలేక సినిమా ఫంక్షన్ కు రాకపోతే.. ఇలా కోపంతో స్టేజ్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు.
నిజానికి నితిన్ తన 'మాచర్ల నియోజకవర్గం' మూవీ ప్రమోషన్స్ తో ఇటీవల కాలంలో చాలా బిజీబిజీగా గడుపుతున్నాడు. అలాంటి సమయంలో అమ్మ రాజశేఖర్ కాల్ చేసి పిలిస్తే.. అందుబాటులో ఉండలేడని మర్యాదపూర్వకంగా వివరించినట్లు ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ అమ్మ రాజశేఖర్ రిక్వెస్ట్ చేయడంతో కుదిరితే వస్తాననే విధంగా నితిన్ మాట్లాడారట. కానీ జ్వరం రావడంతో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. దీన్ని అర్థం చేసుకోకుండా దర్శకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.