అమ్మడు.. కోటికి చేరిన కుమ్ముడు

Update: 2017-04-13 05:45 GMT
మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ మూవీ ''ఖైదీ నెం 150'' సినిమాకు ప్రత్యేక ఆకర్షణ ఏంటి అంటే.. ఖచ్చితంగా అది అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ అనే చెప్పాలి. సినిమాలోచివరాకర్లో వచ్చే ఈ పాటతో ధియేటర్అంతా ఒక ఊపు వచ్చేసింది. అయితే ఈ పాట రిలీజైనప్పుడు మాత్రం ఎన్నో క్రిటిసిజంలను ఫేస్ చేసిన సంగతి తెలిసిందే.

ఏదేమైనా కూడా దేవిశ్రీప్రసాద్ కట్టిన అమ్మడు కుమ్ముడు బాణీ చాలా పాపులర్ అయిపోయింది. అదొక సూపర్బ్ హుక్ లైన్ గా అందరి నోళ్ళలోనూ నానేసింది. ఆ తరువాత వెండితెరపై మెగాస్టార్ వేసిన స్టెప్పులు.. కాజల్ దారబోసిన అందాలు.. మధ్యలో రామ్ చరణ్‌ స్పెషల్ ఎప్పీరియన్స్ వెరసి పాటను బంపర్ హిట్ చేశాయి. సినిమా ఆడటంలో.. 100+ కోట్ల షేర్ వసూలు చేయడంలో.. ఈ పాట ప్రధాన పాత్రనే పోషించింది. అయితే ఇప్పుడు ఈ పాట వీడియోను యుట్యూబ్ లో రిలీజ్ చేశారు. సదరు పాట అప్పుడే 1 కోటి వ్యూస్ ను తెచ్చుకుంది. టి-సిరీస్ ఛానల్ లో ఉన్న ఈ వీడియోను 10 మిలియన్ మంది చూశారంటే అసలు ఈ పాటకున్న క్రేజ్ చూసుకోండి.

మొత్తానికి కొన్ని రోజులకు యుట్యూబ్ లో అత్యంత ఎక్కువగా వీక్షించబడిన పాటగా ఈ కుమ్ముడు సాంగ్ రికార్డుల్లోకి ఎక్కేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు!!

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News