తెలుగు ప్రేక్షకులకు ‘అతిథి’లా వచ్చి పరిచయం అయ్యి వెళ్లి పోయిన అమృతా రావు బాలీవుడ్ లో మంచి ఆఫర్లనే దక్కించుకుంది. తెలుగులో కనిపించకున్నా బాలీవుడ్ లో వరుసగా పెద్ద హీరోల చిత్రాల్లో నటించింది. ఈమద్య కాలంలో ఈ అమ్మడి జోరు కాస్త తగ్గింది. అవకాశాల కోసం ఈ అమ్మడు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడినది. ఈమ్మడు తాజాగా ఒకానొక సందర్బంలో తన కెరీర్ లో మొదటి హిట్ ఇష్క్ విష్క్ తాలూకు జ్ఞాపకాలను నెమరవేసుకుంది. ఆ సందర్బంగా హీరోను చెంప దెబ్బ కొట్టే సీన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఈ చిత్రంలో ఒక సీన్ లో భాగంగా హీరో షాహిద్ కపూర్ ను లాగి పెట్టాల్సి ఉంది. పెద్ద హీరోను అందరి ముందు కొట్టడం అంటే కష్టంగా అనిపించింది. షాహిద్ అమ్మగారు నీలిమ అజీమ్ కూడా అక్కడే ఉన్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె నా వద్దకు వచ్చి నాకు సూచనలు చేశారు. ఆమె స్వయంగా షాహిద్ ను ఎలా కొట్టాలి ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వాలనే విషయాన్ని సూచించారు.
ఆమె చెప్పిన ప్రకారం కాస్త గట్టిగానే షాహిద్ ను కొట్టానంటూ ఆ సరదా సంఘటనను గుర్తుకు తెచ్చుకుంది. ఆ సీన్ వెండి తెరపై చాలా అద్బుతంగా పండినది. ప్రేక్షకులు ఆ సీన్ కు అంతగా కనెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం షాదిత్ అమ్మగారు అయిన నీలిమ గారే. ఆమె సూచన మేరకు నేను ఆ రోజు ఆ సీన్ ను బాగా చేయగలిగానంటూ అమృత పేర్కొంది.