బ్రిటన్ భామ అమీ జాక్సన్ ఇప్పుడు ఇండియాలో ఫుల్ స్పీడ్ లో చెలరేగిపోతోంది. భారీ సినిమాలు.. క్రేజీ ప్రాజెక్టులు.. హాట్ ఫోటో షూట్స్ తో తన స్టైల్ లో ట్యాలెంట్ ను చూపించడమే కాదు.. అప్పుడప్పుడు జంతు సంరక్షణపైనా తన గళం విప్పుతుంటుంది. చాలామంది సెలబ్రిటిలు జంతు ప్రేమను చాటుతుంటారు. కానీ అమీ మాత్రం ఇందులో భాగంగా ఏకంగా అమెరికా అధ్యక్షుడిపైనే కోపం చూపించేసింది.
రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమీకి అమితమైన కోపం వచ్చింది. జింబాబ్వే.. జాంబియా దేశాలలో జరిగే ట్రోఫీ హంటింగ్ కు అనుమతించాలని నిర్ణయించడం.. ఏనుగు దంతాల దిగుమతికి అంగీకరించడం వంటి నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ సర్కారు.. వీటిపై వచ్చిన విమర్శల కారణంగా.. మళ్లీ ఈ డెసిషన్స్ ను వెనక్కు తీసుకుంది. కానీ ఈ ఆలోచననే తప్పు పట్టింది అమీ జాక్సన్. 'ఏనుగు దంతాలను యూఎస్ కు తీసుకురావాలన్న ఆలోచనే అత్యంత ఘోరం. ఇలాంటి అద్భుతమైన జంతువుల మనుగడను రూపుమాపాలనే ఆలోచన ఎలా చేయగలరు? ఇలా జరిగేందుకు మనం అంగీకరించకూడదు. ఏనుగులను కాపాడాలి' అంటూ వాపోయింది అమీ జాక్సన్.
ప్రస్తుతం రజినీకాంత్ తో కలిసి నటించిన రోబో సీక్వెల్ 2.ఓ రిలీజ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న అమీ.. శివరాజ్ కుమార్-సుదీప్ లు నటిస్తున్న కన్నడ మూవీ ది విలన్ షూటింగ్ లో పాల్గొంటోంది.