బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో మీద అంచనాలు మామూలుగా లేవు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కీలకమైన దుబాయ్ షెడ్యూల్ కోసం ప్లానింగ్ లో ఉంది. సుమారు 150 కోట్ల బడ్జెట్ తో ఇది రూపొందుతోందన్న వార్త ప్రారంభం అయినప్పటి నుంచి జాతీయ మీడియాను సైతం ఆకర్షించింది. కేవలం ఒక్క సినిమా వయసున్న దర్శకుడు సుజిత్ ని నమ్మి ప్రభాస్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి ఓకే చెప్పడం చూస్తే కంటెంట్ ఎంత బలంగా ఉందో అనే నమ్మకం కలుగుతోంది. శ్రద్ధా కపూర్ రెండు షేడ్స్ ఉన్న హీరొయిన్ పాత్ర పోషిస్తోందని ఇప్పటికే ఒక వినికిడి ఉంది. ఇప్పుడు సాహోకి మరింత ఆకర్షణ జోడించేందుకు బ్రిటిష్ సుందరిని ఫీల్డ్ లోకి దించబోతున్నట్టు తాజా సమాచారం.
రామ్ చరణ్ ఎవడు - శంకర్ ఐ - ధనుష్ నవ మన్మధుడు సినిమాల ద్వారా మనకు బాగా సుపరిచితురాలైన అమీ జాక్సన్ ని ఇందులో క్యామియో కోసం దర్శకుడు సుజిత్ సంప్రదించినట్టు తాజా సమాచారం. కాని అది క్యామియోనా లేక ఏదైనా స్పెషల్ ఐటెం సాంగా అనేది తెలియాల్సి ఉంది. అమీ కనక చేస్తే సినిమాకు మరింత వేల్యూ యాడ్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నట్టు టాక్. దీనికి మరో ప్రత్యేక కారణం కూడా ఉంది. సాహో కంటే ముందు అమీ జాక్సన్ 2.0 విడుదల అవుతుంది. సో అందులో నటించినందుకు వచ్చే పేరు కూడా సాహో విడుదల అయ్యే సమయానికి ప్లస్ అవుతుందని అంచనా వేసారట.
పూర్తి యాక్షన్ అండ్ స్టైలిష్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న సాహో విడుదల ఈ ఏడాది ఉంటుందా లేదా అనేది అనుమానంగానే ఉంది. అందుకే యూనిట్ ఎక్కడా రిలీజ్ డేట్ గురించి మాట్లాడ్డం లేదు. హై టెక్నికల్ స్టాండర్డ్స్ లో రూపొందుతున్న మూవీ కాబట్టి డెడ్ లైన్ పెట్టుకుని ఒత్తిడి తెచ్చుకోకోకుండా నిదానమే ప్రధానం ఫార్ములా పాటిస్తూ క్వాలిటీ మీదే దృష్టి పెట్టారట. దీని తర్వాత ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. సో బాహుబలి పక్కన రోబో సుందరిని త్వరలో చూడబోతున్నాం.